ఈ మధ్యకాలంలో కొంత మంది మగాళ్లు మృగాలుగా మారి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. చివరికి కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే హద్దులు దాటి ప్రవర్తించిన ఓ కసాయి భర్త భార్య నిండు గర్భిణి అని కూడా చూడకుండా కిరాతకానికి పాల్పడ్డాడు. తాజాగా కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దావణగెరె జిల్లా చెన్నగిరి పరిధిలోని గంగొండనహళ్లి ప్రాంతం. ఇక్కడే మోహన్ కుమార్ (24), రేష్మ(20) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. అయితే పెళ్లి సమయంలో మోహన్ కుమార్ భార్య రేష్మను బాగా చూసుకుంటానని మాటిచ్చాడు. ఇదంతా నిజమేనని నమ్మిన భార్య రేష్మ భర్తను ప్రాణంగా చూసుకుంది. అలా రోజులు గడుస్తున్న క్రమంలోనే రేష్మ గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే మోహన్ కుమార్ తన అసలు రూపాన్ని బయటకు తీశాడు. భార్యను అనుమానించడంతో పాటు అదనపు కట్నం తేవాలంటూ వేధించడం మొదలు పెట్టాడు.
ఇదే కారణంతో మోహన్ కుమార్ భార్యను తీవ్ర హింసలకు గురి చేశాడు. కట్టుకున్న మొగుడే కదా అంటూ రేష్మ అన్నీ భరిస్తూ వచ్చింది. ఇక ఇన్నాళ్లు భరించినా రేష్మ భర్త ఆగడాలు పెచ్చు మీరడంతో తట్టుకోలేకపోయింది. దీంతో తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోహన్ కుమార్ కు కౌన్స్ లింగ్ ఇచ్చి పంపించారు. కానీ మోహన్ కుమార్ తన బుద్దిని మాత్రం అస్సలు మార్చుకోకుండా మళ్లీ అలాగే ప్రవర్తించాడు. దీంతో ఇటీవల మోహన్ కుమార్ భార్య రేష్మతో మళ్లీ గొడవకు దిగాడు. కోపంతో ఊగిపోయిన మోహన్ కుమార్ భార్య నిండు గర్భిణి అన్నవిషయాన్ని కూడా మరిచి దారుణంగా హత్య చేశాడు. కూతురు మరణించడంతో రేష్మ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.