కర్ణాటకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గతంలో తల్లిదండ్రులు మరణించడంతో ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఒకే ఇంట్లో ఉండేవారు. అప్పటి నుంచి ముగ్గురు అక్కాచెల్లెళ్లు స్థానికంగా ఓ కంపెనీలో పని చేస్తూ జీవనాన్ని కొనసాగించారు. అలా ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు కొంత కాలం పాటు కాలాన్ని వెల్లదీశారు. అయితే ఆ బాధను భరించలేని ఈ అక్కా చెల్లెళ్లు ముగ్గురు ఒకే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషాద ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది. ఈ విషాద ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటకలోని తమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి పరిధిలోని బరకనహాల్ తండా. ఇక్కడే రంజిత, బిందు, చందన అనే ముగ్గురు అక్కా చెల్లెళ్లు నివాసం ఉండేవారు. అయితే గతంలో వీరి తల్లిదండ్రులు మరణించారు. దీంతో అప్పటి రంజిత, బిందు స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ అమ్మమ్మ వద్ద ఉండేవారు. ఆమెనే వీరి ముగ్గురుని చూసుకునేది. కానీ, తల్లిదండ్రులు లేకుండా మేము అనాథలమయ్యాని ముగ్గురు తరుచూ బాధపడుతుండేవారు. అయితే మూడు నెలల కిందట వారి అమ్మమ్మ కూడా మరణించింది. దీంతో వీరు మరింత కృంగిపోయారు. ఇన్నాళ్లు తల్లిదండ్రులు లేరనే బాధపడితే.. ఇప్పుడు ప్రాణంగా చూసుకున్న అమ్మమ్మ కూడా చనిపోడంతో తీవ్ర మనస్థాపానికి లోనయ్యారు.
ఈ క్రమంలోనే ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఎవరూ లేని అనాథలుగా బతకడం కంటే చనిపోవడం మేలు అనుకున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఒకే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తాజాగా వీరుంటున్న ఇంట్లో నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఇక పోలీసులు వారి ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా.. ముగ్గురు ఉరికి వేలాడుతూ కనిపించారు. ఈ సీన్ చూసిన పోలీసులు, స్థానికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎవరూ లేని అనాథలమయ్యామనే కారణంతోనే వీరు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.