గృహహింస అంటే.. ఒకప్పుడు కేవలం ఆడవారు మాత్రమే ఎదుర్కొనేవారు. వరకట్న వేధింపులు, ఆడపిల్ల పుట్టిందని చీదరింపులు, అత్తా ఆడపడుచుల ఆరళ్లు.. బయట అడగుపెడితే.. కామంతో ఒళ్లు కొవ్వొక్కి కారు కూతలు కూసే మృగాళ్లు.. ఇలాంటి పరిస్థితులు మధ్య ఆడవారి బతుకు దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లు ఉండేది. వరకట్న అగ్ని కీలల్లో ఎందరో ఆడవాళ్లు సజీవ దహనం అయ్యారు. ఆదుకునేవారు లేక.. ఇలాంటి బతుకు బతికే కన్నా చావే మేలు అనుకునేవారు. ఇలాంటి పరిస్థితుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడం కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేశాయి. అయితే సుమారు 15-20 ఏళ్ల క్రితం వరకు ఇలాంటి చట్టాలున్నప్పటికి.. మహిళలకు వాటిపై సరైన అవగాహన లేకపోవడం వల్లనో.. కుటుంబం పరువు పోతుంది.. పిల్లలుంటే.. వారితో కలిసి ఒంటరిగా బతకలేం అనే ఉద్దేశంతో.. భర్త, అత్తమామలు ఎన్ని హింసలు పెట్టినా సరే.. మౌనంగా భరించేవారు.
మరి నేటి కాలంలో పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా అంటే రాలేదు.. పైగా గృహహింస బాధితుల్లో మగవారు కూడా చేరారు. నేటి కాలంలో కొందరు ఆడవాళ్లు.. చట్టాలను అడ్డుపెట్టుకుని.. అమాయుకులైన భర్త, అత్తింటి వారిని వేధింపులకు గురి చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఆడవారు ఇలాంటి వేధింపుల వల్ల బాధపడుతున్నారు అంటే.. వారి పట్ల సానుభూతి చూపుతారు. అదే మగవారికి ఇలాంటి పరిస్థితులు ఎదురయితే.. సానుభూతి చూపడం సంగతి పక్కన పెట్టి.. ఎగతాళి చేస్తారు చుట్టుపక్కల వాళ్లు. దాంతో అటు వేధింపులను భరించలేక.. ఇటు ఎవరికి చెప్పుకోలేక.. వారిలో వారే సతమతమవుతూ.. చివరకు ప్రాణాలు తీసుకునే వంటి దారుణ నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. భార్య వేధింపులు తట్టుకోలేక.. పెళ్లైన 3 నెలలకే నవ వరుడు మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది. ఆ వివరాలు..
ఈ విషాదకర సంఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. బెంగళూరు ఉళ్లాల ఎంవీ లేఔట్లో ఈ దారుణం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది. ఈ ప్రాంతానికి చెందిన మహేశ్వర అనే యువకుడికి.. 3 నెలల క్రితం కవన అనే యువతితో వివాహమయ్యింది. అయితే కొత్తగా పెళ్లైన జంట.. ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ.. చిలకగోరికంల్లా కలిసిమెలసి ఉండాలి. అయితే మహేశ్వర జీవితంలో ఇవేమి లేవు. పెళ్లై పట్టుమని 3 నెలలు కూడా నిండకముందే.. అతడు నిండు నూరేళ్ల జీవితాన్ని అంతం చేసుకున్నాడు.
పెళ్లైన నాటి నుంచి మహేశ్వరకు, అతడి భార్యకు మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఏదో విషయంలో కవన.. మహేశ్వరని నిందిస్తుండేది. ఇక భార్య వేధింపులు తట్టుకోలేక.. ఐదు రోజుల క్రితం.. మహేశ్వర దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఇంటిలో ఉరేసుకుని.. ఆత్మహత్య చేసుకుంటాడు. కోడలి వేధింపులు తట్టుకోలేకనే.. తమ కుమారుడు మహేశ్వర ఆత్మహత్య చేసుకున్నాడు అతడి తల్లిదండ్రులు.. ఆమెపై ఆరోపణలు చేశారు.