ఈ కాలం యువత తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాలను కాదని ప్రేమ వివాహాలకు మొగ్గచూపుతున్నారు. ప్రేమించిన వాడితో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడతో ఎదురించి మరీ లవ్ మ్యారేజ్ లు చేసుకుంటున్నారు. ఇది నచ్చని యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక ప్రియుడిపై దాడి చేయడం, లేదంటూ అతడిని కిడ్నాప్ చేసి హత్య చేయడమో చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజుకొక చోట జరుగుతూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ప్రేమ జంట తల్లిదండ్రులు ఎదురించి వివాహం చేసుకున్నారు. దీనిని జీర్ణించుకోలేకపోయిన యువతి బంధువలు దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని ఇందిరా నగర్ ప్రాంతం. ఇక్కడే ఓ యవకుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే ఈ యువకుడికి గతంలో ఇదే ప్రాంతానికి ఓ చెందిన ఓ యువతి పరిచయం అయింది. అలా కొంత కాలం పాటు వీరిద్దరూ ఛాటింగ్, మీటింగ్ లంటూ కలిసి తిరిగేవారు. ఇక కొన్ని రోజుల గడిచాక ఒకరికొకరు నచ్చుకోవడంతో ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా వీరి ప్రేమను కొంతకాలం పాటు కొనసాగించారు. ఇక రోజులు గడిచే కొద్ది ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. ఎలాగైన పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇక ఇందులో భాగంగా యువతి, యువకుడు తాజాగా పెళ్లి చేసుకున్నారు.
మేము ఇద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని, మాకు రక్షణ కావాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, కుటుంభ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కోపంతో ఏం చేయాలో అర్థం కాక ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో ఆ యువకుడి ఇళ్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో దాదాపు రూ.3 నుంచి 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని యువకుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులను స్టేషన్ కు పిలపించి కౌన్స్ లింగ్ ఇచ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.