CRIME NEWS : భార్య వివాహేతర సంబంధం కారణంగా ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ప్రియుడు, అతడి కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి గొడవ చేయటంతో పరువు పోయిందని భావించిన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. కరీంనగర్ జిల్లా గొల్లపల్లికి చెందిన గంగాధర్‌కు పదేళ్ల కిందట తిరుపతమ్మతో వివాహమైంది. ఓ బిడ్డ పుట్టిన తర్వాత ఆమె మరణించింది. దీంతో గంగాధర్ నంచర్లకు చెందిన మమతను రెండో వివాహం చేసుకున్నాడు. వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెళ్లై ఆరేళ్లయినా వీరికి పిల్లలు పుట్టలేదు.
దీంతో మమత ఎదురింటి అభిషేక్‌తో సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన గంగాధర్, మమతను హెచ్చరించాడు. అయినప్పటికి ఆమె పద్దతిలో మార్పురాలేదు. ఈ నెల 11న మమత, అభిషేక్‌తో కలిసి ఉండగా పట్టుబడింది. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. గత శనివారం రాత్రి అభిషేక్, అతని కుటుంబసభ్యులు గంగాధర్ ఇంటికి వచ్చి గొడవ చేశారు. ఈ గొడవ నేపథ్యంలో తీవ్ర మనోవేధనకు గురైన అతడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మొన్న హస్నియా, నిన్న లావణ్య, నేడు మౌనిక
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.