తెలంగాణలో ఊహించని దారుణం వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రిని ఇంట్లో పెట్టి కూతుళ్లు నిప్పు పెట్టారు. ఈ మంటల్లో కాలి తండ్రి సజీవదహనమయ్యాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
సమాజంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అసలు మనం మనుషుల మధ్యే బతుకుతున్నామా అనే అనుమానం కలుగుతోంది. మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఇలా ఒకటేంటి.. రోజుకు ఎన్నో దారుణాలు చూస్తున్నాం, వింటున్నాం. కానీ, తాజాగా తెలంగాణలో జరిగిన ఘోరం వింటే మాత్రం కన్నీళ్లు రాక మానవు. కన్న తండ్రిని ఇంట్లో పెట్టి కూతుళ్లు నిప్పు అంటించారు. ఈ దాడిలో తండ్రి మంటల్లో కాలి సజీవదహనమయ్యాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రాజంపేట గ్రామం. ఇక్కడే కొప్పుల ఆంజనేయులు (70) అనే వృద్దుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఆంజనేయులు గతంలో ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు చేశాడు. ఇదిలా ఉంటే ఆంజనేయులుకు గ్రామంలో అతని పేరు మీద కొంత పొలం ఉంది. అయితే ఇటీవల ఆయన ఒక ఎకరా పొలం అమ్మడంతో రూ.10 లక్షలు వచ్చాయి. ఇక డబ్బులు రావడంతో కూతుళ్లకు ఆశపెరిగింది. ఎలాగైన తండ్రి నుంచి డబ్బులు తీసుకోవాలని కూతుళ్లు తండ్రితో గొడవకు దిగారు. ఇదే విషయంపై ముగ్గురు కూతుళ్లు తండ్రితో వాగ్వాదానికి దిగారు. ఇక తండ్రి కూతుళ్లకు డబ్బు ఇవ్వడానికి నిరాకరించినట్లుగా తెలుస్తోంది.
ఇదే కోపంతో కూతుళ్లు తండ్రిపై పగ పెంచుకున్నారు. ఎలాగైన తండ్రి ఆంజనేయులును చంపాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే ముగ్గురు కూతుళ్లు మనవడి సాయంతో తండ్రి ఆంజనేయులు ఇంట్లో నిద్రపోతుండగా ఇంటికి నిప్పు పెట్టారు. ఆ మంటల్లో ఆంజనేయులు కాలిపోయి సజీవ దహనమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తిగా కాలిబూడిదైన ఆంజనేయులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఆస్తి కోసం కన్న తండ్రిని కిరాతకంగా హత్య చేసిన కూతుళ్ల దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.