మళ్లీ వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన యమునా.. సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. అయితే ఆ తర్వాత జరిగింది తెలుసుకుని ఆ మహిళ పిల్లలు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఆమె పేరు యమున. వయసు 30 ఏళ్లు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఈ మహిళకు 8 ఏళ్ల కిందట ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అలా కొన్నేళ్ల తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి చేరాయి. దీంతో యమున భర్తను వదిలి పుట్టింటికి వెళ్లింది. అక్కడే కొన్నాళ్లపాటు ఉంటుంది. ఇదిలా ఉంటే చేతికి గాయం అయిందని, మామిడాకు తెస్తానని యమున ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. కానీ, సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. అసలు చివరికి ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది కామారెడ్డి జిల్లా సారంగాపూర్ మండలం జామ్. ఇదే గ్రామానికి చెందిన యమున (30)కు 8 ఏళ్ల కిందట అనిల్ అనే వ్యక్తితో వివాహం జరిగింది.పెళ్లైన కొన్ని రోజుల తర్వాత ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక పుట్టిన పిల్లలను చూసుకుంటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. అలా కొన్నేళ్ల తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు చెలరేగాయి. ఇక భర్తతో ఉండలేని యుమన తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. అయితే ఇటీవల చేతికి గాయం అయిందని, మామిడాకు తెస్తానని యమున ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది.
కానీ, సాయంత్రం అయినా ఆమె ఇంటికి రాలేదు. దీంతో ఆ మహిళ తండ్రి ఖంగారుపడి అంతటా వెతికాడు. ఎంత వెతికినా.. యమున ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక ఏం చేయాలో తెలియని యమున కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఉన్నట్టుండి యమున కనిపించకుండపోవడంతో ఆమె పిల్లలు, కుటుంబ సభ్యులు కంటతడి పెడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్నఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిజేయండి.