ఆమెకు పెళ్లై పిల్లలు కూడా జన్మించారు. భర్తతో పాటు పుట్టిన పిల్లలతో ఆమె కాపురం ఎంతో సంతోషంగా సాగుతూ ఉంది. అయితే ఉపాధి కోసం ఆమె భర్త మూడేళ్ల క్రితం కువైట్ వెళ్ళాడు. అక్కడ అతను కూడబెట్టిన సోమ్మును నెల నెల భార్యా పిల్లల ఖర్చులు, వారి విలాసాలకు సరిసడ డబ్బులను పంపిస్తున్నాడు. అలా అతను పంపించే డబ్బుతో అన్ని అవసరాలు తీరుతున్నా.. భార్యకు కొంత సుఖం మాత్రం దక్కడం లేదు. దీంతో స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుని చివరికి ప్రియుడి మైకంలో పడి అందమైన కుటుంబ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసింది. అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది కడప జిల్లా వేంపల్లె పట్టణంలోని భరత్ నగర్. ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో షేక్ ఫరహాన్ అనే మహిళకు గతంలో వివాహం జరిగింది. ఇక ఉపాధి నిమిత్తం భర్త కువైట్ వెళ్లి నెలకు సరిపడా డబ్బులు పంపిస్తున్నాడు. ఖర్చులకు పోను కొంత డబ్బు మిగిలేది. వీటితోనే ఫరహాన్ వడ్డీ వ్యాపారం చేసేది. ఇక భర్త లేకపోవడంతో ఫరహాన్ స్థానికంగా బాషా అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూనే వడ్డీ వ్యాపారం కూడా చేసేది. ఇక సమయం దొరికినప్పుడల్లా ఆమె ప్రియుడితో ఎంచక్కా ఇంట్లోకి దూరి ఎంజాయ్ చేసేది. ఇక ఇంతటితో ఆగని ఆమె ప్రియుడు బాషా.. నీ భార్యతో ఉన్నానంటూ భర్తకు వీడియో కాల్ చేసేవాడు.
ఇది కూడా చదవండి: Siddipet: పురుటినొప్పులతో గర్భిణి ఆస్పత్రికి వెళ్లింది.. కానీ అక్కడ జరిగింది చూస్తే!
భార్య ఇంతటి ఘన కార్యం చేస్తుందనుకుని భర్త ఆమెకు డబ్బులు పంపండం, పట్టించుకోవడం కూడా పూర్తిగా మానేశాడు. అయితే ఫరహాన్ చేసే వడ్డీ వ్యాపారంలో కొందరు వ్యక్తులు ఇచ్చిన డబ్బులతో పాటు వడ్డీ కూడా తిరిగి ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు ప్రయత్నంచారు. ఈ క్రమంలోనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి ఫరహాన్ అప్పుడప్పుడు వెళ్లేది. అలా ఫరహన్ వచ్చిపోతున్న సమయంలోనే ఆమెకు ఓ పోలీస్ ఆఫీసర్ పరిచయమయ్యాడు. వీరి పరిచయం రాను రాను వివాహేతర సంబంధానికి దారి తీసింది. బాషా కాకుండా ఫరహాన్ పోలీస్ తోనూ అక్రమ సంబంధాన్ని కొనసాగించింది.
ఈ విషయం ఆమె ప్రియుడు బాషాకు తెలిసింది. ఇక పట్టలేని కోపంతో ఊగిపోయిన ఆమె ప్రియుడు ఫరహాన్ ను అంతమొందించాలనే కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఫరహాన్ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఫరహాన్ మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు బాషాపై అనుమానంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.