పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అస్లాం. నేను పోలీసును అంటూ చెప్పుకుంటూ ఎంతో మంది అమాయకులను మోసం చేశాడు. ఇక ఇంతటితో ఆగని ఈ కేటుగాడు.. ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇలా ఒకరిని కాదు, ఇద్దరిని కాదు.. ఏకంగా సైలెంట్ గా 6 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే ఈ నకిలీ పోలీసు ఇటీవల 7వ పెళ్లికి సిద్దమవుతుండగా.. ఊహించిన షాక్ తగిలింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
జార్ఖండ్ రాజధాని రాంచీ ధన్ బాద్ లోని భులిలో అస్లాం (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతగాడు తన మతం, గుర్తింపు, ఇలా అన్ని వివరాలు దాచి పెట్టి పోలీసును అంటూ స్థానికంగా చలామణి అయ్యడు. దీంతో పోలీసును అంటూ బెదిరించి ఎంతో అమ్మాయిలను మోసం చేసి మెల్లగా తన ట్రాప్ లోకి దింపేవాడు. ఆ తర్వాత ఎన్నో మాయమాటలు వల్లించి చివరికి ప్రేమ పేరుతో పెళ్లి వరకు వెళ్లేవాడు అలా ఒకరిని కాదు, ఇద్దరిని కాదు.. ఏకంగా 6 పెళ్లిళ్లు చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే గతేడాది డిసెంబర్ 7న హర్లలో అస్లాం సంజయ్ గా పేరు చెప్పుకుని.. ఓ మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడు. ఇక ఇంతటితో ఆగని ఈ నకిలీ పోలీస్.. ఇటీవల ఏడో పెళ్లికి కూడా సిద్దమయ్యాడు. ఈ క్రమంలోనే ఇతగాడి లీలలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. దీంతో బాధిత మహిళలు ఇతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అస్లాం వివరాలు తెలుసుకుంటుండగా.. సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇతడు గిరిజన, హిందు, మైనారిటీల అమ్మాయిలను మోసం చేసి 6 పెళ్లిళ్లు చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇక ఈ క్రమంలోనే పక్కా సమాచారంతో వెళ్లిన పోలీసులు.. ఎట్టకేలకు నిందితుడు అస్లాం ను తాజాగా రాంచీలో అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.