భర్త నిర్మాత, భార్య నటిగా ఇండస్ట్రీలో బాగానే గుర్తు సంపాదించారు. అనేక సినిమాలు చేస్తూ భార్యాభర్తలు బిజీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. వీరికి గతంలో వివాహం జరిగి మూడేళ్ల కూతురు కూడా ఉంది. అయితే ఈ దంపతులు పని నిమిత్తం ఇటీవల పశ్చిమ బెంగాల్ కు వెళ్లారు. హౌరా జిల్లాలోని బగ్నాన్ నది వద్ద కారులో ప్రయాణిస్తుండగా కొందరు గుర్తు తెలియని దుండగులు అతని భార్యపై తుపాకీతో కాల్పులు జరిపారు. భర్త వెంటనే భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకపోవడంతో భార్య ప్రాణాలు విడిచింది. తాజాగా పశ్చిమ బెంగాల్ లో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతుంది. అసలు ఆ నటి ఎవరు? దుండగులు ఎందుకు ఆ నటిని చంపారనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జార్ఖండ్ కు చెందిన నటి రియా కుమారి ఇండస్ట్రీలో పలు సినిమాల్లో అనేక పాత్రలు పోషించి నటిగా పేరు తెచ్చుకుంది. ఆమె భర్త ప్రకాష్ కుమార్ సైతం ఇండస్ట్రీలో నిర్మాతగా రాణిస్తున్నాడు. వీళ్లిద్దరికి గతంలో పరియం ఉండడతో ఇష్టపడి వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు కూతురు కూడా జన్మించింది. ఇదిలా ఉంటే ఇటీవల ఈ భార్యాభర్తలు పని నిమిత్తం పశ్చిమ బెంగాల్ కు వెళ్లారు. బుధవారం ఉదయం 6 గంటలకు ఈ దంపతులు హౌరా జిల్లా ఉలుబెరియా సబ్ డివిజన్ పరిధిలోని బగ్నాన్ వద్ద కారులో వెళ్తున్నారు. భర్త ప్రకాష్ కుమార్ కారు నడుపుతుండగా భార్య రియా కుమారి కూతురితో పాటు ఆడుతూ ఉంది. ఈ క్రమంలోనే కొందరు గుర్తు తెలియని దుండగులు కాపు కాసి తుపాకీతో నటి రియా కుమార్ పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు.
దీంతో నటి రియా రక్తపు మడుగులో పడిపోయింది. ఇక భర్త వెంటనే నటి రియా కుమారిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకపోవడంతో అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు నిర్దారించారు. రియా కుమారి మరణించడంతో భర్త ప్రకాష్ కుమార్ కూతురుతో పాటు శోక సంద్రంలోని మునిగిపోయారు. నటి కాల్పుల ఘటనపై స్పందించిన ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితులు వారి నుంచి విలువైన వస్తువులను దోచుకోవడానికే నటిపై కాల్పలు జరిపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. నటి రియా కుమారి హత్యకు గురి కావడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుమకున్నాయి. ఈ దారుణ హత్య పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.