నేటి కాలం యువత ప్రతీ చిన్న విషయానికి మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు మందలించారని, చదువులో రాణించలేకపోతున్నానని, ప్రియుడు మోసం చేశాడని.. ఇలా అనేక రకాల కారణాలతో చివరికి క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ కోవకే చెందిన ఓ యువకుడు తాజాగా తల్లిదండ్రులు పాకెట్ మనీ ఇవ్వలేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి సమాచారం మీ కోసం.
జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ ప్రాంతం. ఇక్కడే అప్పాల మల్లేశ్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఇతని కుమారుడైన వికాస్ (19) స్థానికంగా ఉండే ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. అయితే వికాస్ రూ.3 వేలు పాకెట్ మనీ కావాలని ఇటీవల తండ్రి మల్లేశ్ ని అడిగాడు. దీనికి తండ్రి లేవంటూ నిరాకరించాడు. తండ్రి అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదని మానస్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆ యువకుడికి ఏం చేయాలో తెలియక జీవితంపై విరక్తి చెంది ఇలాంటి బతుకు నాకొద్దు అనుకున్నాడు. ఇక ఇంట్లో ఎవరూ లేని సమయంలో మానస్ ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇక తల్లిదండ్రులు ఇంటికొచ్చి చూడగా.. కుమారుడు ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. ఈ సీన్ చూసిన మానస్ తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. లబోదిబోమంటూ ఏడుస్తూ కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో అతడు అప్పటికే మరణించాడు. కుమారుడు ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రతీ చిన్న విషయానికి ఆత్మహత్యకు పాల్పడుతున్న ఇలాంటి వారికి మీరిచ్చే సూచలను ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.