హేమలత-నాగరాజు దంపతులు. ఈ భార్యాభర్తలకు గతేడాది మే నెలలో వివాహం జరిగింది. ఇదిలా ఉంటే మంగళవారం బెడ్రూంలో కోడలు అత్తకు ఊహించని స్థితిలో కనిపించింది. అసలేం జరిగిందంటే?
పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు హేమలత. వయసు 24 ఏళ్లు. ఆమెకు గతేడాది మే నెలలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొన్ని నెలల పాటు ఈ దంపతుల వైవాహిక జీవితం ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగానే సాగింది. కట్ చేస్తే హేమలత ఇటీవల బెడ్ రూంలో అత్తకు ఊహించని స్థితిలో కనిపించింది. ఆ సీన్ చూసిన అత్త ఒక్కసారిగా షాక్ గురైంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పరిధిలోని సింగోటం గ్రామానికి చెందిన హేమలత (24)ని కొండ్రావుపల్లికి చెందిన నాగరాజు గతేడాది మే నెలలో వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే జీవించారు. కాగా, నాగరాజు తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్ లోని మియాపూర్ లో నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు పూల వ్యాపారం చేస్తుండగా, నాగరాజు డ్రైవర్ గా పని చేస్తుండేవాడు.
అలా కొన్ని నెలల పాటు హేమలత-నాగరాజు దంపతుల వైవాహిక జీవితం బాగానే సాగింది. కట్ చేస్తే.. మంగళవారం ఉదయం 11 గంటలు అవుతున్నా.. కోడలు హేమలత బెడ్రూం నుంచి ఇంకా బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన అత్త.. ఇంటి కిటికీలు తెరిచి చూడగా.. కోడలు ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇదంతా గమనించిన కొందరు స్థానికులు వెంటనే తలుపులు బద్దలు కొట్టి హేమలతను కిందకు దించి చూడగా.. ఆమె అప్పటికే ప్రాణాలు విడిచింది.
ఈ విషయం తెలుసుకున్న హేమలత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరకట్నం వేధింపుల కారణంగానే మా కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.