ఫొటోలో కినిపిస్తున్న బాలిక పేరు లాస్య. తెల్లవారు జామున ఉదయం 4 గంటల సమయం. అప్పుడే నిద్రలేచిన ఆ బాలిక నేరుగా టెర్రస్ పైకి వెళ్లింది. అనుమానంతో తల్లి చూడగా కూతురు ఊహించని స్థితిలో కనిపించింది. అసలేం జరిగందంటే?
అది తెల్లవారు జామున ఉదయం 4 గంటల సమయం. అప్పుడే నిద్రలేచిన ఆ బాలిక నేరుగా టెర్రస్ పైకి వెళ్లింది. సడెన్ గా నిద్రలేచిన తల్లికి.. ఏదో శబ్దం వినిపించింది. ఏంటని అనుమానంతో అక్కడికి వెళ్లి చూడగా.. కూతురు ఊహించని స్థితిలో కనిపించింది. ఆ సీన్ చూసిన తల్లికి ఒక్కసారిగా చెమటలు పట్టాయి. ఆ సమయంలో తల్లికి ఏం చేయాలో తెలియక కుటుంబ సభ్యులను పిలిచింది. లాస్యను అలా చూసి చూసి వాళ్లు సైతం షాక్ గురయ్యారు. ఆ బాలిక ఎలాంటి స్థితిలో కనిపించింది? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ మియాపూర్ లోని రెడ్డి కాలనీలో సునీల్ చౌదరి, గీతా లావణ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి లాస్య (16) అనే కూతురు కూడా ఉంది. ఈ బాలిక స్థానికంగా ఉండే ఓ కాలేజీలో ఇంటర్ చదువుతుంది. ఇక రోజు కాలేజీకి వెళ్లి రావడం, మళ్లీ ఇంట్లో చదువుకోవడం చేసిది. అయితే ఏం జరిగిందో ఏం తెలియదు కానీ, బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు లాస్య నిద్రలేచింది. అనంతరం ఆ బాలిక నేరుగా వారుంటున్న బిల్డింగ్ టెర్రస్ పైకి వెళ్లింది.
లాస్య ఆ బిల్డింగ్ పై నుంచి కిందకు దూకింది. ఇక ఉదయం 5 గంటలకు తల్లి గీతా అప్పుడే నిద్రలేచింది. ఇంటి బయట ఏదో ములుగుతున్న శబ్దం వస్తుండడంతో తల్లి అనుమానంతో బయటకు వెళ్లి చూడగా… కూతురు లాస్య రక్తపు మడుగులో పడి కనిపించింది. కూతురుని తల్లి ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయింది. ఏడుస్తూనే తన కుటుంబ సభ్యులను పిలిచింది. పరుగు పరుగున వచ్చి కుటుంబ సభ్యులు లాస్యను అలా చూసి షాక్ గురయ్యారు. దీంతో వెంటనే ఆ బాలికను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అయితే పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆ బాలిక మరణించిందని తెలిపారు. ఆ వార్త విన్న లాస్య కుటుంబ సభ్యులు గుండెలు ప గిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాలిక ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న కారణం తెలియాల్సి ఉంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అయితే ఉన్నట్టుండి లాస్య బలవన్మరణానికి పాల్పడడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.