అది పేరుకేమో బ్యూటీ పార్లర్. లోపలికి వెళ్తే మాత్రం.. అందులో అందమైన అమ్మాయిలు, మహిళలతో గలీజ్ పనులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ ను అడ్డగా చేసుకుని కొనసాగిస్తున్న ఈ పాడుపనులపై తాజాగా పోలీసులు దాడులు నిర్వాహించారు.
హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకుని గత కొంత కాలంగా చాలా మంది గలీజ్ పనులకు శ్రీకారం చుడుతున్నారు. అమాయక అమ్మాయిలు, నిరుపేద మహిళలను ఆసరాగా చేసుకుని పాడు పనులకు తెర లేపుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ఇకపోతే తాజాగా హైదరాబాద్ లో బ్యూటీ పార్లర్ ముసుగులో అలాంటి పనులు చేయిస్తూ డబ్బులు గుంజుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. హైదరాబాద్ మియాపూర్ ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ అనే వ్యక్తి.. గుట్టు చప్పుడు కాకుండా గత కొంత కాలంగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నాడు. అమాయక యువతులు, నిరుపేద మహిళను ఆసరాగా చేసుకుని ఇలాంటి గలీజ్ పనులకు తెరలేపుతున్నాడు. అయితే ఇందులో భాగంగానే నిర్వాహకుడు అజయ్ కుమార్ బ్యూటీ పార్లర్, స్పా ముసుగులో వ్యభిచారాన్ని నడిపిస్తున్నారు. ఈ బిజినెస్ గత కొంత కాలంగా కొనసాగుతూ వస్తుంది. దీనిని పసిగట్టిన కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పక్కా ప్లాన్ తో కదిలిన పోలీస్ యంత్రాంగం బ్యూటీ పార్లర్, స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఏకంగా 10 మంది యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏపీకి చెందిన ముగ్గురు విటులతో పాటు వ్యభిచార నిర్వాహకుడు అజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక నుంచి బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ల ముసుగులో ఎవరైన వ్యభిచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.