పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎంత పకడ్బంధీగా వ్యవహరిస్తున్నా కూడా ఇంకా హైదరాబాద్ నగరంలో ఏదో మూల వ్యభిచారం నడుస్తూనే ఉంది. పోలీసులు ఇప్పటివరకు మసాజ్ సెంటర్లు, స్పాలలో వ్యభిచారం గుట్టు రట్టు చేశారు. మొన్నీ మధ్య ఇళ్లలోనూ వ్యభిచారం నడుస్తున్నట్లు పోలీసులు కనుగొని వాటిని కూడా కట్టడి చేశారు. ఇప్పుడు ఓ లాడ్జి యజమానే గుట్టు చప్పుడు కాకుండా తన లాడ్జిలో వ్యభిచారం నడిపిస్తుండగా.. పోలీసులు రైడ్ చేసి వారిని అరెస్ట్ చేశారు. వేరే ప్రాంతాల నుంచి వారిని టార్గెట్ చేస్తూ సె*క్స్ వర్కర్లను నియమించుకుని ఓ వ్యాపారంలా దీనిని నిర్వహిస్తున్న వ్యక్తి ఆటకట్టించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి ఎదురుగా శ్రీ వెంకటేశ్వరా లాడ్జి ఉంది. దానిని కర్నాటి రామారావు అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. అందులో యడ్డ సహదేవ్ అనే వ్యక్తి రిసెప్షనిస్ట్ గా చేస్తున్నాడు. యజమాని రామారావు సె*క్స్ వర్కర్లను నియమించుకుని రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వెంకటేశ్వరా లాడ్జ్ లో సోదాలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో ఇద్దరు విటులు, ఇద్దరు మహిళలను, యజమాని రామారావు సహా రిసెప్షనిస్ట్ సహదేవ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా అలాంటి వ్యవహారాలు మరెక్కడైనా జరుగుతున్నాయా అని పోలీసులు ఆరా తీయడమే కాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు.