మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన భార్యను పూర్తిగా పట్టించుకోవడమే మానేశాడు. పదేళ్ల కాలం పాటు భరిస్తూ వచ్చిన భార్య చివరికి భర్తను కాదని విడిచి వెళ్లిపోయింది. దీంతో ఏకాకిగా మారిన భర్త చివరికి తట్టుకోలేక సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. శంషాబాద్ లోని చౌదరిగూడలోరవి (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఇతనికి పదేళ్ల కిందటే ఓ మహిళతో వివాహం జరిగింది.
పెళ్లైన కొన్నాళ్లకి వీరికి ఓ కూతురు, కుమారుడు జన్మించారు. రవి ఆటో డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చాడు. అయితేకొంత కాలం పాటు భర్త రవి బాగానే ఉన్నాడు. కానీ కొన్ని రోజులు గడిచాక మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానేయాలంటూ అనేక సార్లు భార్య భర్తకు చెప్పి చూసింది. కానీ.. రవి భార్య మాటను అస్సలు లెక్కచేయకుండా రోజూ తాగుతూనే ఉండేవాడు. ఇక భర్త తీరుతో విసుగు చెందిన భార్య భర్త రవిని వదిలి వెళ్లిపోయింది. భార్య వదిలివెళ్లడంతో భర్త రవి తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు.
ఇక చేసేదేం లేక తాజాగా.. నేను మద్యానికి బానిసై నా భార్యను, పిల్లలను పట్టించుకోవడమే మానేశాను. నన్ను భరించలేని నా భార్య నా నుంచి వెళ్లిపోయింది. పదేళ్ల పాటు నేను మారతానని వేచి చూసింది. అయినా నాలో మార్పు రాకపోవడంతో నా భార్య నా నుంచి దూరంగా వెళ్లిపోయింది. తప్పంతే నాదే. మద్యానికి బానిసై ఇప్పుడు ఏకాకినయ్యాను. అందుకే చనిపోతున్నా అంటూ రవి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాతో కాస్త వైరల్ గా మారి చివరికి పోలీసుల వరకు వెళ్లింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్నఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.