లష్కరే తోయిబా, ఐఎస్ఐ సాహకారంతో హైదరాబాద్ లో గతేడాది దసరా పండగ నేపథ్యంలో వరుస పేలుళ్లకు పథకం రచించారు. ఈ పేలుళ్లలో భాగంగా పాతబస్తికి చెందని ఓ యువకుడి సాహకారాన్ని కూడా తీసుకున్నారు. దీనికి వెనుక అసలు ఏం జరిగిందంటే?
హైదరాబాద్ లో పెలుళ్ల కుట్ర కేసును పోలీసులు గతంలోనే ఛేదించారు. ఈ ఘటనలో ఇది వరకే కొందరిని పోలీసులు అరస్ట్ చేయగా.. తాజాగా పాతబస్తికి చెందిన మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఈ దుర్మార్గులు పేలుళ్లకు ఎలాంటి పథకం వేశారు? వారి ప్రణాళికలో ఎలాంటి ఎత్తుగడలు వేశారు? ఈ పేలుళ్ల వేనుక అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
లష్కరే తోయిబా, ఐఎస్ఐ సాహకారంతో హైదరాబాద్ లో గతేడాది దసరా పండగ నేపథ్యంలో వరుస పేలుళ్లకు పథకం రచించారు. ఈ కుట్రలో భాగంగా మహమ్మద్ సమీయుద్దీన్, అబ్దుల్ జాహెద్, మాజ్ హసన్ ఫరూక్ అనే నిందితులు ప్రధాన పాత్ర పోషించి హైదరాబాలో పేలుళ్లకు కుట్ర చేశారు. అయితే ఈ కుట్ర కేసును నగర పోలీసులు గతేడాది అక్టోబర్ 2న పసిగట్టి.. ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న.. చైనా గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు వీరిని అనేక కోణాల్లో విచారించగా తాజాగా పాతబస్తికి చెందిన ఓ యువకుడితో సంబంధాలు ఉన్నాయని తెలిసింది.
అయితే ఈ భారీ కుట్రకు నిందితులు పాతబస్తికి చెందిన అబ్దుల్ కలీమ్ అనే యువకుడి సాహకారం తీసుకున్నారు. ఇక ఇతనితో పాటు మరో కొంతమంది సాయాన్ని తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. కాగ.. పాకిస్తాన్ నుంచి వచ్చే హవాలా డబ్బును పేలుళ్ల కుట్రకు వీరు ఖర్చు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే ఈ పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు.. తాజాగా పాతబస్తి నుంచి సాహకారం అందించిన నిందితుడు అబ్దుల్ కలీమ్ ను తాజాగా అరెస్ట్ చేశారు. ఇదే ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.