ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ సికింద్రాబాద్ లోని రైల్వే స్టేషన్ లో లోకో పైలెట్ గా ఉద్యోగం చేస్తుంది. గతంలో ఈ ఉద్యోగంలో చేరిన ఈ మహిళ అప్పటి నుంచి హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటుంది. ఇక ప్రతీ రోజు ఉద్యోగానికి వెళ్లడం, తిరిగి రూమ్ కు రావడం వచ్చి తిని పడుకోవడం చేస్తుండేది. ఇక అప్పుడప్పుడు ఆ మహిళ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడుతుండేది. ఇదిలా ఉంటే నవంబర్ 30వ తేదీన ఆ మహిళ ఉద్యోగానికి వెళ్లింది. ఇక అదే రోజు తిరిగి రూమ్ లోకి వచ్చింది. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు.. సాయంత్రం బయటకు వెళ్తున్నానని ఇంటి ఓనర్ కు చెప్పి వెళ్లింది.
ఇక రాత్రైన ఆ మహిళ రూమ్ కు చేరలేదు. ఈ సమయంలోనే మహిళ తల్లిదండ్రులు కూతురుకి ఫోన్ చేశారు. కానీ ఎంతకు కూడా ఆ మహిళ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆ మహిళ తల్లిదండ్రులు కూతురు ఉంటున్న రూమ్ ఓనర్ ఫోన్ చేసి… వారి కూతురు గురించి అడిగి తెలుసుకున్నారు. దీనికి సమాధానం ఇచ్చిన రూమ్ ఓనర్.. సాయంత్రం 4 గంటలకు బయటకు వెళ్తానని చెప్పి వెళ్లింది. మళ్లీ తిరిగి రాలేదని చెప్పాడు. ఇక ఓనర్ కు అనుమానం రావడంతో ఆ మహిళ రూమ్ లోకి వెళ్లి చూడగా.. సెల్ ఫోన్ రూమ్ లోనే వదిలేసి వెళ్లింది.
ఇక చేయాలో అర్థం కాని ఆ మహిళ తల్లిదండ్రులు.. నవంబర్ 30 నుంచి మా కూతురు కనిపించడం లేదంటూ.. సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మహిళ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ ఎక్కడైన కనిపిస్తే.. 9490617132, ఎస్ఐ 8919558998 సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. అయితే ఉన్నట్టుండి కూతురు కనిపించకుండా పోవడంతో ఆ మహిళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.