గుట్టుచప్పుడు కాకుండా ఓ మహిళ అతని స్నేహితుడితో కలిసి పాడుపనికి శ్రీకారం చుట్టింది. అడ్డు అదుపు లేకుండా తన ఫ్రెండ్ తో కలిసి ఏకంగా వ్యభిచారాన్ని నడిచించారు. గతంలో జరిగిన ఈ ఘటనపై తాజాగా పోలీసులు స్పందించి నిందితులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. తాజాగా ఇదే అంశం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? వ్యభిచారానికి పాల్పడింది ఎవరనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలోకి విశాఖపట్నం ఎల్లంపేటకు చెందిన గంధ భవాని (25), తూర్పు గోదావరి జిల్లా అన్నవరంకు చెందిన కసిరెడ్డి దొరబాబు (23) స్నేహితులు.
అయితే వీరిద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఇక ఈ పరిచయంతోనే ఈ స్నేహితులు కష్టపడకుండా డబ్బులు ఎలా సంపాదించాలి అనే ఆలోచనలు చేశారు. ఇక ఇందులో భాగంగానే వీరిద్దరికి వ్యభిచారం నిర్వహించాలనే ఐడియా తట్టింది. ఇక ఆలస్యం చేయని వీరిద్దరూ హైదరాబాద్ లో వాలిపోయారు. నగరంలో మీర్ పేట్ లోని టీకేఆర్ పరిధిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. అనంతరం ఇతర ప్రాంతాల నుంచి అందమైన మహిళలను తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారాన్ని నిర్వహించడం మొదలు పెట్టారు. అలా కొంత కాలం పాటు వీరి చీకటి వ్యభిచారం ఘనంగా వర్ధిల్లుతుంది. దీంతో పాటు సొమ్మును కూడా కూడబెడుతూ విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు.
ఇదే విషయాన్ని కొందరు స్థానికులు పసిగట్టారు. చేసేదేంలేక ఈ ఏడాది అక్టోబర్ 13న స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించారు. స్థానికుల సమాచారంతో సైలెంట్ గా వెళ్లిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార నిర్వహిస్తున్న ఆ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నిర్వహకులు గంధ భవాని, కసిరెడ్డి దొరబాబులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక దీంతో పాటు నగరానికి చెందిన ఇద్దరు మహిళలను సైతం పోలీసులు రక్షించారు. అయితే ఇదే ఘటనలో వ్యభిచారం నిర్వహించిన నిందితులు కసిరెడ్డి దొరబాబు, గంధ భవానినిపై పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. ఇలాంటి వ్యభిచారాలను ఇక నుంచి ఎవరూ నిర్వహించిన కఠిన శిక్షలు ఉంటాయని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.