హైదరాబాద్ లోని బీఫార్మసీ విద్యార్థిని రోషిణి ఈ నెల 13 నుంచి కనిపించకుండపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. పటాన్ చెర్ లోని గీతం యూనివర్సిటీ రోషిణి అనే యువతి బీఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే ఈ నెల 13 నుంచి సంక్రాంతి సెలవులు కావడంతో తన బాబాయో ఇంటికి వెళ్తున్నానని హాస్టల్ లో చెప్పి వెళ్లింది. ఆ తర్వాత రోషిణి 16వ తేదీ వరకు తన బాబాయ్ ఇంటి వద్ద ఉండి ఆ రోజు తిరిగి హాస్టల్ కు వెళ్తున్నానని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ నెల 22న రోషిణి టాంజానియలో ఉన్న తన తండ్రి రాముకు ఫోన్ చేసి.. నేను ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు ఖంగారుపడ్డారు.
కూతురికి తల్లిదండ్రులు అనేక సార్లు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. వెంటనే కూతురు ఉంటున్న హాస్టల్ కు ఫోన్ చేయగా… ఇక్కడికి రాలేదని చెప్పారు. దీంతో రోషిణి తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో రోషిణి తన బాబాయ్ ఇంటి వద్దే క్షేమంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కూతురు క్షేమంగా ఉందని తెలియడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ యువతి డిప్రెషన్ లోకి వెళ్లిందని, దీని కారణంగానే ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.