హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వియ్యంకుడు మజారుద్దీన్ అనే వ్యక్తి ఇంట్లో తుపాతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
నగరంలో ఓ వైద్యుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన ఇంట్లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ డాక్టర్ తాజాగా ప్రాణాలు విడిచాడు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో మజారుద్దీన్ అనే వ్యక్తి డాక్టర్ గా సేవలు అందిస్తున్నాడు. రోజూ ఆస్పత్రికి వెళ్తూ వస్తూ ఉండేవాడు. అయితే గత కొంత కాలం నుంచి ఇంట్లో కుటుంబ తగాదాలు నడుస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మజారుద్దీన్ సోమవారం తుపాకీతో కాల్చుకుని రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఇక వెంటనే గమనించిన అతని కుటుంబ సభ్యులు ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మజారుద్దీన్ ఆస్పత్రిలో మరణించాడు. అయితే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి మజారుద్దీన్ వియ్యంకుడని తెలుస్తుంది. దీంతో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.