ఓ భర్త, ఇద్దరు భార్యలు. కొన్నాళ్ల పాటు వీరి సంసారం బాగానే నడిచింది. కొన్నిరోజుల తర్వాత భర్త ట్రాక్ తప్పి వక్ర బుద్దిని చూపించాడు. విషయం ఏంటంటే? ఇంట్లో ఇద్దరు భార్యలు ఉన్నా చాలదన్నట్లుగా.. భర్త మరో మహిళతో రిలేషన్ ను కొనసాగించాడు. కొన్ని రోజుల తర్వాత భర్త చీకటి కాపురం మొదటి భార్యకు తెలిసింది. ఇదే విషయంపై మొదటి భార్య బుద్దిమార్చుకోవాలని భర్తకు సూచించింది. అయినా భర్త తీరులో మార్పు రాకపోవడంతో మొదటి భార్య సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వరంగల్ హన్మకొండలోని కాజీపేటలో జిన్నారపు వేణు కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇద్దరి మహిళలను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య పేరు సుష్మిత కాగ, రెండవ భార్య పేరు సంతోషి. అయితే భర్త వేణు కుమార్ కొంత కాలం పాటు ఇద్దరి భార్యలతో సంతోషంగానే ఉన్నాడు. కానీ, రాను రాను భర్త బుద్ది వక్రమార్గంలోకి వెళ్లింది. విషయం ఏంటంటే? ఇంట్లో ఇద్దరు భార్యలు ఉన్నా సరిపోవడం లేదన్నట్లు.. భర్త వేణు కుమార్ స్థానికంగా ఉండే మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. కొన్ని రోజుల తర్వాత భర్త చీకటి సంసారం తన మొదటి భార్యకు తెలిసింది. దీంతో మొదటి భార్య బుద్ది మార్చుకోవాలంటూ భర్తను అనేక సార్లు హెచ్చరించింది.
అయినా భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోగా.. ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక సహించలేకపోయిన మొదటి భార్య భర్త హత్యకు పథకం రచించింది. ఇందులో భాగంగానే సుష్మిత అనిల్ అనే వ్యక్తితో 4 లక్షలకు డీల్ కుదుర్చుకుంది. ఇక భర్త హత్యలో భాగంగా సుష్మిత సెప్టెంబర్ 30న భర్తకు సేమియాలో స్లీపింగ్ టాబ్లెట్ కలిపి ఇచ్చింది. ఇది తిన్న భర్త వేణుగోపాల్ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. సుష్మిత వెంటనే అనిల్ కు సమాచారం అందించింది. దీంతో అనిల్ పరుగు పరుగున సుష్మిత ఇంటికి వచ్చి ఆమె భర్త వేణుగోపాల్ ను కారులో ఎక్కించుకుని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఇక మరుసటి రోజు మొదటి భార్య సుష్మిత నా భర్త కనిపించడం లేదంటూ రాక్షస ప్రేమతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. అయితే పోలీసుల విచారణలో ఎందుకో మృతుడి మొదటి భార్య సుష్మితపై అనుమానం వచ్చింది. పోలీసులు సుష్మిత మొబైల్ కాల్ డేటాను పరిశీలించగా ఆమెకు రౌడీలతో మాట్లాడినట్లుగా తేలింది. చివరికి పోలీసులు సుష్మితను గట్టిగా విచారించే సరికి మృతుడి మొదటి భార్య అసలు నిజాలు బయటపెట్టింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల నిందితురాలు సుష్మితతో పాటు అనిల్, మరో ముగ్గురుని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.