రోజులు మారుతున్న కొద్ది బాధ్యత గల ఉద్యోగులు బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. 14 ఏళ్ల బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం, వైద్యానికి వచ్చిన బాలికపై డాక్టర్ లైంగిక వేధింపులు.. ఇలాంటి హెడ్డింగ్ లతో అనేకమైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటి బాధ్యత గల ఓ మహిళా టీచర్ 15 ఏళ్ల టీనేజ్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. ఏడాది కిందట ఫ్లోరిడాలో జరిగిన ఈ కేసు రిపోర్ట్ గురించి తాజాగా ప్రముఖ న్యూస్ జర్నల్ పెన్సకోలా ప్రచురించటం విశేషం.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాలో ఎస్కాంబియా కౌంటీ స్కూల్లో మహిళా టీచర్ గా ఓ 39 ఏళ్ల మహిళ విధులు నిర్వర్తిస్తుంది. అయితే ఇదే పాఠశాలలో ఓ 15 ఏళ్ల టినేజ్ కుర్రాడు చదువుకుంటున్నాడు. సదరు టీచర్ కుమారుడు ఈ 15 ఏళ్ల కుమారుడికి స్నేహితుడు. అప్పడప్పుడు టీచర్ ఇంటికి వస్తుండడంతో 15 ఏళ్ల టీనేజ్ కుర్రాడిపై ఆ మహిళా టీచర్ కన్నుపడింది. దీంతో ఎలాగైన ఆ అబ్బాయిని లొంగదీసుకోవాలని భావించి ఆ దిశగా ప్రయత్నాలు చేసింది, విజయం కూడా సాధించింది.
ఇక మొత్తానికి ఆ కుర్రాడిని పరిచయం చేసుకుని లైంగిక దారుల్లోకి వెళ్లింది. ఇక అప్పటి నుంచి ఆ కుర్రాడితో సమయం దొరికినప్పుడల్లా ఏడాది పాటుగా శారీరక సుఖాలు తీర్చుకుంటూ ఉండేది. అయితే ఎట్టకేలకు ఆ బాలుడిని మహిళా టీచర్ లైంగిక వేధింపులకు గురి చేయటంతో అంతా బయటపడింది. ఇక పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు లేలడంతో కోర్టు ఆ మహిళకు ఏకంగా 6 ఏళ్ల జైలు శిక్ష విధించింది. స్కూల్ యాజమాన్యం కూడా ఆమెను సస్సెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏడాది కిందట జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.