Green Bawarchi: రాయదుర్గంలోని ఓ హోటల్ బిల్డింగ్‌లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ షర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో 20 మంది దాకా కస్టమర్లతో పాటు 10 మంది సిబ్బంది కూడా ఉన్నారు. హోటల్‌లోని రెండు అంతస్తుల్లో అత్యంత వేగంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆ వెంటనే పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు ప్రారంభించారు.
మంటల్ని అదుపులోకి తెచ్చి, లోపల ఉన్న 30 మందిని నిచ్చెన సహాయంతో కిందకు తీసుకువచ్చారు. అయితే, లోపల ఉన్న వారిలో ఓ ఇద్దరు వ్యక్తులు బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకేశారు. దీంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవటం సంతోషకరం. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Adilabad Crime: కన్న కూతురిని గొంతుకోసి చంపిన తల్లితండ్రులు! కారణం?