పాఠాలు చెప్పాల్సిన ఆ పంతులమ్మ ప్రేమ పాఠాలు చెప్పింది. తన దగ్గరకు ట్యూషన్ చెప్పించుకోవటానికి వచ్చిన బాలుడితో ప్రేమ వ్యవహారం నడిపింది. ఇద్దరూ ప్రేమలో మునిగితేలారు. చివరకు ఊరినుంచి పారిపోయారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఉత్తర ప్రదేశ్, నోయిడాలోని సెక్టార్ 123కి చెందిన 22 ఏళ్ల యువతి ఇంటి దగ్గరే పిల్లలకు ట్యూషన్లు చెబుతుంది. యువతి ఇంటి దగ్గర ఉండే 16 ఏళ్ల బాలుడు ఒకడు ఈమె దగ్గర ట్యూషన్‌కు వెళ్లాడు. ట్యూషన్ సమయంలో ఇద్దరూ బాగా మాట్లాడుకునే వారు.
ఇలా వీరి పరిచయం కాస్తా స్నేహంగా మారింది. తొండ ముదిరి ఊసరవెల్లి అయిందన్న మాదిరి. వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరి పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని భయపడ్డారు. ఇంటినుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆదివారం ఆ యువకుడు బంధువుల ఇంటికి వెళుతున్నానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. ఆ యువతి కూడా ఇంట్లోంచి బయటకు వెళ్లింది. తర్వాత ఇద్దరూ ఓచోట కలుసుకున్నారు. అక్కడి నుంచి ఎవ్వరి కంటపడకుండా పారిపోయారు.
సాయంత్రం అవుతున్నా కూడా తమ కుమారుడు ఇంటికి రాకపోవటంతో బాలుడి తండ్రికి అనుమానం వచ్చింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ ఇంటి ముందు ఉండే యువతి తమ కుమారుడ్ని ప్రేమ పేరుతో వలలో వేసుకుందని, ఇంటినుంచి తీసుకెళ్లిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు సదరు యువతిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సర్వేలెన్స్ కెమెరాల ద్వారా వారి ఆచూకీ కనిపెట్టే పనిలో పడ్డారు. మరి, 16 ఏళ్ల బాలుడితో ట్యూషన్ టీచర్ ఇంటినుంచి పారిపోయిన ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.