ఈ మద్య కాలంలో దేశంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేసే నిర్లక్ష్యం ఎంతోమంది ప్రాణాలు బలి తీసుకుంటుంది. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు వరకు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు.
ఈ మద్య దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సామాన్యులే కాదు సెలబ్రెటీలు, రాజకీయ నేతలు వారి బంధువులు రోడ్డు ప్రమాదంలో చనిపోతున్న విషయం తెలిసిందే. డ్రైవింగ్ చేసే సమయంలో చిన్న నిర్లక్ష్యం కారణంగా వారి ప్రాణాలే కాదు.. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు కూడా బలితీసుకుంటున్నారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే సతీమణి కన్నుమూశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
దేశ రాజధాని ఢిల్లీలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గత రాత్రి చరెండు కార్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టుకోవడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే రాజేశ్ లిలోతియా సతీమణి మధు లిలోతియా తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ ఉన్న స్థానికులు హుటాహుటిన ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ లోని ట్రామా సెంటర్ కి తీసుకు వెళ్లారు. మధు లిలోతియాను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లుగా ధృవీకరించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ఇంట తీవ్ర విషాదం నిండుకుంది.. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.
సోమవారం రాత్రి మధు లిలోతియా తన కారులో వెళ్తున్న సమయంలో ఎదురుగా అతి వేగంగా ఓ కారు దూసుకు వచ్చి ఆమె ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. దీంతో ఆమెకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ నిండు ప్రాణం బలికావడానికి గల కారకుడైన ఎస్‌యూవీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు.