Electric Scooty: ఈ మధ్య ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. గత నెలలో వరుసగా మూడు ప్రమాదాలు జరిగాయి. ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీలు పేలటమో.. కాలటమో జరిగింది. తమిళనాడులో జరిగిన ఓ ఘటనలో తండ్రీకూతుళ్లు మరణించారు. ఆ ఘటన మరువక ముందే నిజమాబాద్‌లో మరో ఘటన జరిగింది. ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ పేలి ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నిజమాబాద్ పట్టణానికి చెందిన రామకృష్ణకు ఎలక్ట్రిక్ స్కూటీ ఉంది. మంగళవారం రాత్రి స్కూటీకి ఛార్జింగ్ పెట్టి పడుకున్నాడు. ఈ నేపథ్యంలో స్యూటీ బ్యాటరీ పేలింది. ఈ ప్రమాదంలో రామకృష్ణ మరణించాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని హుటాహుటిన దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : భారతావనిలో రంకెలేస్తున్న కుల వివక్ష! నాలుకతో కాళ్లు నాకించారు!