తక్కువ సమయంలోనే ఎక్కవ డబ్బు సంపాదించి ఎంజాయ్ చేయాలని తప్పుడు బాటలో నడుస్తు పోలీసులకు చిక్కుతున్నారు. స్మగ్లర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. విలువైన వస్తువులను విదేశాల స్మగ్లింగ్ చేస్తు కోట్లు సంపాదిస్తున్నారు.
ఈ మద్య చాలా మంది జల్సాలు, చెడు వ్యసనాలకు బానిసలై అక్రమ డబ్బు సంపాదనకు తెగబడున్నారు. ఈజీ మనీ కోసం చెడు మార్గాలను ఎంచుకొని దొంగతనాలకు పాల్పపడుతున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించి ఎంజాయ్ చేయాలని తప్పుడు బాటలో నడుస్తు పోలీసులకు చిక్కుతున్నారు. స్మగ్లర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. విలువైన వస్తువులను విదేశాల నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి విదేశాలకు స్మగ్లింగ్ చేస్తు కోట్లు గడిస్తున్నారు. దొరికితే దొంగలు.. లేదంటే దొరలు అన్న చందంగా వీళ్ల వ్యవహారం సాగుతుంది. ఎంత గోప్యంగా స్మగ్లింగ్ చేస్తున్నా.. కస్టమ్స్ అధికారులకు దొరికిపోతుంటారు. తాజాగా విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్న100 కోట్లు విలువ చేసే బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే..
విదేశాల నుంచి గత కొంత కాలంగా బంగారం అక్రమ రవాణా చేస్తున్న ముఠా పై నిఘా పెట్టారు అధికారులు. భారత్- నేపాల్ సరిహద్దులతో పాటు పాట్నా, పుణె, ముంబై లలో ఏక కాలంలో దాడులు చేశారు. ఈ క్రమంలోనే సూడాన్ కి చెందిన స్మగ్లింగ్ గ్యాంగ్ కి చెక్ పెట్టారు. వీరి నుంచి మొత్తం 101.7 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.51 కోట్ల ఉంటుందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలీజెన్స్ మంగళవారం తెలిపింది. ‘ఆపరేషన్ గోల్డ్ డాన్’ పేరిట చేపట్టిన ఈ భారీ ఆపరేషన్ లో స్మగ్లింగ్ గ్యాగ్ నుంచి రూ.1.35 కోట్ల దేశ, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ స్మగ్లింగ్ కి సంబంధించిన కేసులో పదిమందిని అరెస్ట్ చేశామని.. అందులో ముగ్గురు భారతీయులు కాగా.. ఏడుగురు సూడాన్ దేశానికి చెందిన వారని డీఐఆర్ అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి సమయంలో సూడాన్ కి చెందిన ముగ్గురు పాట్నా రైల్వే స్టేషన్ లో అనుమానంగా తిరుగుతుంటే వారిని పట్టుకొని విచారించగా 37.26 కేజీల గోల్డ్ పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు డీఐఆర్ అధికారులు. పేస్ట్ రూపంలో అక్రమంగా తరలించిన బంగారం అంతా ఇండో-నేపాల్ సరిహద్దుల మీదుగా బీహార్ రాజధాని పాట్నాకు తీసుకు వచ్చారని.. ఆ బంగారాన్ని రైళ్లు, విమానాల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తారని.. ఎక్కువగా ఈ బంగారం ముంబైలో మార్కెట్ అవుతుందని అధికారులు తెలిపారు.