ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడులకు పాల్పపడుతున్నారు.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులు ఊచకోతలు కోస్తూ.. బాంబు దాడులు చేస్తూ విధ్వంసాలు సృష్టిస్తుంటారు. వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం దేనికైనా సిద్దపడుతుంటారు. ఉగ్ర దాడుల్లో ఎంతోమంది అమాయకులు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి ఉగ్రవాదులు పంజావిసిరారు. కారు బాంబు దాడిలో ఓ డిప్యూటీ గవర్నర్ ని హతమార్చారు. వివరాల్లోకి వెళితే..
ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదులు పంజావిసిరారు. ఆ దేశంలోని బదాక్షన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ అయిన నాసిర్ అహ్మద్ అహ్మాదీ కారుబాంబు దాడిలో చనిపోయారు. ఈ విషయాన్ని ప్రావిన్షియల్ అధికార ప్రతినిధి తెలిపారు. ఇటీవల ఐసీస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తాలిబన్ ప్రభుత్వం దాడులు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐసీస్ ఉగ్రవాదులు పలు నగరాల్లో విచక్షణారహితంగా దాడులు నిర్వహించారు. డిప్యూటీ గవర్నర్ నాసిర్ అహ్మద్ అహ్మాదీ మృతిపై ఇన్ఫర్మేషన్ అధికారి ముజాహిత్దీన్ అహ్మది మాట్లాడుతూ.. ‘ఉగ్ర వాదులు జరిపిన కారు బాంబు దాడిలో నాసిర్ అహ్మద్ అహ్మాదీ ఆయన డ్రైవర్ స్పాట్ లోనే చనిపోయారని.. మరో ఆరుగురు సాధారణ పౌరులు గాయపడ్డారు’ అని తెలిపారు.
నాసిర్ అహ్మద్ అహ్మాదీ ప్రావిన్స్ లో సాంస్కృతిక సమాచార విభాగంలో అధిపతిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పపడిన వారు కారులో పేలుడు పదార్థాలను నింపుకొని అహ్మదీ ప్రయాణిస్తున్న వాహనం వైపు దూసుకు వచ్చి పేల్చేసుకున్నారని అన్నారు. గత డిసెంబర్ నెలలో ఇదే ప్రావిన్స్ లోని పోలీస్ చీఫ్ ని ఐసీస్ ఉగ్రవాద సంస్థ దారుణంగా హత్య చేసిందని అన్నారు. 2022 లో ఆఫ్ఘనిస్తాన్ గనుల శాఖాధిపతి ని ఆత్మహుతి దాడిలో హత్య చేశారని అన్నారు.