వాళ్లిద్దరికీ పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. తమ సొంత కాపురాలను కాదని పరాయి సుఖం కోసం వెంపర్లాడారు. భర్తను కాదని ఆమె, భార్యను కాదని ఆయన.. ఇలా ఇద్దరూ సమయం దొరికినప్పుడల్లా శారీరక కోరికలు తీర్చుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. అలా భర్తకు తెలియకుండా ఆ మహిళ తన ప్రియుడితో కలిసి తన చీకటి కాపురాన్ని నడిపిస్తూ వచ్చింది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ప్రియుడు ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు. తాజాగా ఢిల్లీలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఢిల్లీలో ఇటీవల చోటు చేసుకున్న శ్రద్దావాకర్ దారుణ ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.
పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్ లో రేఖా రాణి (35) అనే మహిళ నివాసం ఉంటుంది. గతంలో ఈమెకు ఓ వ్యక్తితో పెళ్లై 16 ఏళ్ల కూతురు కూడా ఉంది. అయితే తిలక్ నగర్ ప్రాంతంలోనే మన్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. ఇతనికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అలా కొన్నాళ్లకి రేఖారాణికి మన్ ప్రీత్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయమే రాను రాను వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధంగా రూపుదాల్చింది. దీంతో ఇద్దరు కొన్నాళ్ల నుంచి తెర వెనుక కాపురాన్ని సాగిస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. అయితే కారణం ఏమిటో తెలియదు కానీ.. గత కొంత కాలం నుంచి ఇద్దరి మధ్య బెడిసికొట్టడంతో విభేదాలు వచ్చాయి. ఇద్దరు చాలా సార్లు గొడవ కూడా పడ్డారు.
ఈ క్రమంలోనే ప్రియుడు మన్ ప్రీత్ సింగ్ ప్రియురాలిపై కోపంతో రగిలిపోయాడు. ఎలాగైన ప్రియురాలిని హత్య చేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే మన్ ప్రీత్ సింగ్ ఓ ప్లాన్ కూడా రచించాడు. ఇటీవల ఓ రోజు మన్ ప్రీత్ సింగ్ ప్రియురాలు రేఖారాణి ఇంటికి వెళ్లాడు. అనంతరం ప్రియురాలు కూతురుకి నిద్రమాత్రలు వేశాడు. ఇక ఆ బాలిక నిద్రలోకి జారుకున్నాక.. తన వెంట తెచ్చుకున్న కత్తితో రేఖా రాణిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఆమె మెడపై కత్తితో దారుణంగా నరకడంతో పాటు ఆ మహిళ వేలును కూడా కోసేశాడు. ఇలా పైశాచికంగా వ్యవహరించడంతో ప్రియురాలు రేఖారాణి ప్రాణాలు కోల్పోయింది. ఇక కొద్దిసేపటి తర్వాత రేఖరాణి కూతురుకు మెలుకువ వచ్చి చూసే సరికి తల్లి రక్తపు మడుగులో పడి విగతజీవిలా పడి ఉంది.
దీంతో ఏం చేయాలో అర్థం కాక ఆ బాలిక.. ఏడుస్తూ ఉంది. ఇక ఆ బాలిక అరుపులు విన్న స్థానికులు పరుగు పరుగున ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి వచ్చి ఆ సీన్ ను చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అనంతరం ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రేఖారాణి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ఇక పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా.. ప్రియుడి చేతిలోనే రేఖారాణి ప్రాణాలు కోల్పోయిందని తెలుసుకున్నారు. అనంతరం పోలీసులు నిందితుడు మన్ ప్రీత్ సింగ్ ను అరెస్ట్ చేశారు. అయితే ఢిల్లీలో ఇలా వరుసగా హత్య ఘటనలు చోటు చేసుకుంటు ఉండడంతో తీవ్ర కలకలంగా మారుతోంది.
DELHI: WOMAN MURDERED BY LIVE-IN PARTNER
A 35-year-old woman was allegedly stabbed to death by her live-in partner in west #Delhi‘s Tilak Nagar. The deceased identified as Rekha Rani’s body had stab wounds and was recovered from her rented house.@priyanktripathi reports pic.twitter.com/EEAUpCCJbv
— Mirror Now (@MirrorNow) December 3, 2022