ఢిల్లీలో మరో ఘోరం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఓ 5 ఏళ్ల చిన్నారిని ఓ గుర్తు తెలియని దుండగుడు కిడ్నాప్ చేశాడు. ఇక ఇంతటితో ఆగకుండా ఎవరికి కనిపించని చోటుకు తీసుకెళ్లి ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఇక ఉన్నట్టుండి కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అంతటా వెతికారు. కానీ ఫలితం లేకపోవడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరికి ఆ పాపను రక్షించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
దేశ రాజధాని ఉత్తర్ ఢిల్లీలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. పెళ్లైన కొంత కాలానికి వీరికి 5 ఏళ్ల చిన్నారి జన్మించింది. అయితే పుట్టిన కూతురితో ఆ తల్లిదండ్రులు సంతోషంగా జీవిస్తున్నారు. ఇదిలా ఉంటే బుధవారం ఆ దంపతులు కాస్త పనుల్లో బిజీగా ఉండడంతో తమ చిన్నారిని కాస్త పట్టించుకోలేదు. ఇదే మంచి సమయం అనుకున్న ఓ గుర్తు తెలియని దుండగుడు ఆ 5 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆ పాపను ఓ పార్క్ సమీపంలోని చెట్ట మధ్యకు తీసుకెళ్లి ఆ చిన్నారిపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక ఉన్నట్టుండి కూతురు కనిపించకుండపోవడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు అంతటా వెతికారు.
ఖంగారుపడి ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక పోలీసులు స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించగా అందులో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ చిన్నారిని ఎత్తుకుని పోతున్నట్లు కనిపించింది. దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని పరిసర ప్రాంతాల్లో వెతకగా.. చివరికి ఆ చిన్నారి ఓ పార్క్ సమీపంలో కనిపించింది. అనంతరం పోలీసులు ఆ చిన్నారి ఆస్పత్రికి తరలించి చికిత్సలు జరిపించగా.., ఆ చిన్నారిపై అత్యాచారం జరిగిందని తెలుసుకున్నారు. ఇక పోలీసులు ఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇక త్వరలో నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అభం శుభం తెలియని చిన్నారిపై రాక్షసుడిలా ప్రవర్తినించిన ఈ దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
5-YR-OLD KIDNAPPED & RAPED IN DELHI
A five-year-old girl was #kidnapped and then raped in #Delhi‘s Bhalswa diary. #Police said the girl was kidnapped by a man when she was playing outside her home in Bhalswa Dairy area on Wednesday.@Verma__Ishika reports pic.twitter.com/YCzHdx5Poa
— Mirror Now (@MirrorNow) December 23, 2022