తండ్రి మరణించాడు.. ఆమెతోడ ఆరుగురు తోబట్టువులు. వారితో పాటు తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత.. పెద్ద కుమార్తె అయిన తన మీదనే పడింది. తండ్రి మరణంతో కుంగిపోయినప్పటికి.. కళ్ల ముందు తోబుట్టువుల భవిష్యత్తు ఆమెను భయపెట్టింది. వారందరికి మంచి జీవితం ఇవ్వలేకపోయినా సరే.. మూడు పూటలా తిండి.. వేసుకోవడానికి సరైన దుస్తులు.. చదివిస్తే చాలనుకుంది. వారి భవిష్యత్తు కోసం.. తన జీవితాన్ని త్యాగం చేసి.. రాత్రింబవళ్లు కష్టపడి పని చేయసాగింది. శుభకార్యల సీజన్‌లో ఎక్స్‌ట్రా వర్క్ కూడా చేసేది. దానిలో భాగంగా.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన క్ష ఫంక్షన్‌లో పని చేయడానికి వెళ్లింది. అర్థరాత్రి తర్వాత.. పని ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యింది. ఈ క్రమంలో యాక్సిడెంట్‌లో మృత్యువాత పడింది. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం బాధ వర్ణించడానికి మాటలు లేవు. ముందు తండ్రిని.. ఇప్పుడు.. పెద్ద దిక్కైన అక్కను కోల్పోయి.. మరో సారి రోడ్డున పడ్డ ఆ కుటుంబం రోదన ఆకాశన్నంటింది. ఆ వివరాలు..
ఈ భయానక సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. బాధిత యువతిని ఢిల్లీ అమన్ విహార్‌కి చెందిన అంజలిగా గుర్తించారు. తండ్రి మరణించిన కుటుంబంలో ఆమెనే పెద్ద కూతురు. తల్లితోపాటు నలుగురు అక్కా చెళ్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లున్నారు. ఈ క్రమంలో అంజలి.. వివాహాలు, ఇతర శుభాకార్యాల్లో పార్ట్‌టైమ్ వర్క్ చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం కూడా ఇలాంటి ఓ ఫంక్షన్‌కు హాజరై.. తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ప్రమాదానికి గురైంది. వేగంగా వస్తోన్న కారు.. అంజలి స్కూటీని ఢీకొట్టింది. అనంతరం.. సుల్తాన్ పూరి నుంచి.. ఢిల్లీలోని కంఝవాలా వరకు సుమారు 4 కిలోమీట్లర దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ క్రమంలో అంజలి డ్రెస్.. కారు టైర్‌లో చిక్కుకోవడంతో.. ఆమె ఒంటి మీద నూలు పోగు లేకుండా.. నగ్నంగా పడి ఉంది.
ఇది గమనించిన స్థానికులు.. సోమవారం తెల్లవారజామున.. 3.30 గంటలకు రోహిణి జిల్లాలోని కంఝవాల్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి.. కుతుబ్‌గఢ్ వైపుగా వెళ్తున్న గ్రే బాలెనో కారు.. యువతిని లాక్కెళ్లుతూ ఉన్నదని తెలిపారు. అనంతరం.. తెల్లవారుజామున 4.11 గంటలకు మరికొందరు కాల్ చేసి.. రోడ్డుపై మహిళ మృతదేహం పడి ఉందని తెలిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే.. పికెట్‌ల దగ్గర మోహరించిన పోలీసులు అలర్ట్ అయ్యి.. ప్రమాదానికి కారణం అయిన వాహనం కోసం గాలించడం ప్రారంభించారు. ఆ తర్వాత కారు నంబర్ ఆధారంగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమ కారు ఓ స్కూటీని ఢీ కొట్టిందని చెప్పిన నిందితులు.. యువతిని తమ కారు కొన్ని కిలోమీటర్ల మేరకు లాక్కొచ్చిందనే విషయం అసలు తమకు తెలియదని చెప్పడం గమానార్హం.
ఇక బాధితురాలి తల్లి మాత్రం.. తన కుమార్తెపై అత్యాచారం చేసి.. హత్య చేశారని ఆరోపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన పై ఢిల్లీ కమిషన్ ఫర్ విమెన్స్ చీఫ్ స్వాతి మాలివాల్ రియాక్ట్ అయ్యారు. ఆ కారులో ఉన్నవారు మద్యం సేవించి ఉన్నట్లు తమకు తెలిసిందన్నారు. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని.. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఢిల్లీ పోలీసులకు సమన్లు పంపిస్తామని తెలిపారు. బాధితురాలిపై లైంగికదాడి జరిగిందని కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. పోలీసులు ఆ ఆరోపణలను ఖండించారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
दिल्ली के कंझावला में एक लड़की की नग्न अवस्था में लाश मिली, बताया जा रहा है कि कुछ लड़कों ने नशे की हालत में गाड़ी से उसकी स्कूटी को टक्कर मारी और उसे कई किलोमीटर तक घसीटा।
ये मामला बेहद भयानक है, मैं दिल्ली पुलिस को हाज़िरी समन जारी कर रही हूँ। पूरा सच सामने आना चाहिए।— Swati Maliwal (@SwatiJaiHind) January 1, 2023