అండర్ వేర్ లో రూ. 15 లక్షల విలువైన బంగారం అంటే మీరేదో ఇన్స్ట్రుమెంట్ అని అనుకోకండి. ఇది వేరే ముచ్చట. నిజంగానే అండర్ వేర్ లో బంగారం ఉంది. కుర్రాడు మాంచి రొమాంటిక్ అనుకుంట. రొమాంటిక్ ప్లేస్ లో బంగారాన్ని దాచి స్మగ్లింగ్ చేద్దామనుకున్నాడు. కానీ ఈ హైడ్ అండ్ సీక్ గేమ్ లో కుర్రాడు వీక్. అందుకే పోలీసులకి దొరికిపోయాడు. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైరు’ అని పుష్ప సినిమాలో హీరోలా దొరక్కుండా మేనేజ్ చేద్దామనుకున్నాడు. కానీ పోలీసులు ఫ్లవర్ ని చేసి పడేశారు. పుష్ప సినిమాలో హీరో గంధపు చెక్కల స్మగ్లింగ్ చేసినప్పుడు దొరక్కుండా ఉండేందుకు ఊహకి అందని విధంగా స్కెచ్చులు, ప్లాన్ లు వేస్తాడు. పోలీసులు కూడా కనిపెట్టలేరు.
అది సినిమా కాబట్టి డైరెక్టర్ ఏమైనా రాసుకుంటాడు. కానీ రియల్ లైఫ్ లో అలా కుదరదుగా. స్మగ్లర్లు ఒక స్క్రిప్ట్ రాసుకుంటే, పోలీసులు మరొక స్క్రీన్ ప్లే రాస్తారు. ఎన్ని వెధవ ప్లాన్ లు, స్కెచ్ పెన్ లతో వచ్చినా పోలీసులు ఇట్టే పసిగట్టేస్తారు. తాడ్ని తన్నేవాడు ఉంటే వాడ్ని తలదన్నేవాళ్ళు ఉంటారు. విదేశీ పోలీసుల కళ్ళు కప్పి.. వారి కంట పడకుండా మేనేజ్ చేసుకుంటూ గోల్డ్ బిస్కెట్లు, మత్తు పదార్థాలు వంటివి ఇండియా తీసుకొచ్చేయాలని ప్లాన్ చేస్తారు. కానీ పోలీస్ జాబ్ ఎక్కడైనా ఒకటేగా. విదేశీ ఎయిర్ పోర్ట్ లో మిస్ అయితే ఇండియన్ ఎయిర్ పోర్ట్ లో కాపు కాస్తారు. మొత్తానికి అక్కడో, ఇక్కడో దొరక్కుండా అయితే ఉండరు.
తాజాగా సింగపూర్ విమానాశ్రయంలో అర కిలోకి 200 గ్రాములు తక్కువ.. 301 గ్రాముల బంగారాన్ని ఎక్కడా చోటు లేనట్టు అండర్ వేర్ లో దాచాడో వ్యక్తి. అయితే కస్టమ్స్ అధికారులకి ఇన్ఫార్మర్లు ఉంటారుగా. సింగపూర్ నుంచి కేరళలోని తిరుచ్చికి ఓ వ్యక్తి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులకి ఎవరో సాల్ట్ ప్యాకెట్ అందించారు. దీంతో పక్కా సమాచారంతో ఆ వ్యక్తిని గుర్తించి సింగపూర్ ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. లగేజ్ మొత్తం తనిఖీ చేశారు. కానీ ఏమీ కనబడలేదు. బ్లడీ స్మగ్లర్ బాడీ మొత్తం వెతికినా కూడా బంగారం దొరకలేదు. తప్పుడు సమాచారం అనుకున్నారు మొదట.
అయితే అందులో ఉండే వేరే అధికారి.. ‘నాకెందుకో ఆ వ్యక్తి లో దుస్తుల్లో గోల్డ్ హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతుంది’ అని అనడంతో అధికారులు ఆ వ్యక్తి లో దుస్తులను కూడా తనిఖీ చేశారు. ఇంకేముంది బాబు అండర్ వేర్ నుంచి గోల్డ్ పేస్ట్ ఉన్న ప్యాకెట్ బయటపడింది. చాలా తెలివిగా అండర్ వేర్ రెండు పొరల మధ్య బంగారాన్ని పేస్ట్ కింద చేసి దాచాడు. ఆ బంగారం పేస్ట్ 301 గ్రాములు ఉంటుందని, 24 క్యారెట్ల బంగారం అని అధికారులు తేల్చారు. దీని విలువ రూ. 15.32 లక్షలు ఉంటుందని తెలిపారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “రేయ్ ఏంటిది? మాకేంటి ఈ దరిద్రం.. మాకేటి అంటున్నాను” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
कच्छे में छिपाकर ला रहा था 15 लाख का सोना।
ये मामला सिंगापुर का है, यात्री अंडरवियर में 301 ग्राम सोना छिपाकर लाने की कर रहा था कोशिश। कस्टम के मुताबिक़ बरामद सोने की कीमत 15 लाख रूपए बताई जा रही है। pic.twitter.com/y7368WmrPt
— Shubhankar Mishra (@shubhankrmishra) October 2, 2022