crime news : బీచ్‌లో విహరించటానికి వెళ్లిన ప్రేమ జంటపై కొందరు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. ప్రియుడిని కట్టేసి, ప్రియురాలిపై అత్యాచారం చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని బందరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మచిలీపట్నానికి చెందిన ఓ యువతి నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో డిగ్రీ చదువుతోంది. నగరానికి చెందిన మరో కాలేజీలో డిగ్రీ చదువుతున్న యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. బుధవారం మధ్యాహ్నం ఇద్దరు కలిసి బందరు మండలం చినకరగ్రహారం శివారు పల్లెపాలెం సమీపంలోని బీచ్‌కు వెళ్లారు. బీచ్ ఒడ్డులో కూర్చుని మాట్లడుకుంటూ ఉన్నారు. ఈటైంలో అక్కడికి వచ్చిన యర్రం శెట్టి మణిదీప్, పోసిన నాగబాబు వారి దగ్గరకు వెళ్లారు.
వారితో అసభ్యంగా ప్రవర్తించారు. ఆ తర్వాత ప్రియుడ్ని మణిదీప్ తాళ్లతో కట్టేశాడు. నాగబాబు ప్రియురాలిని బలవంతంగా తోటలోకి లాక్కెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇద్దర్నీ వదిలేశారు. ఇంటికి వెళ్లిన వీరు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేకపోయారు. అయితే, కూతురి ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు ఏమైందని అడిగారు. ఆమె జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పింది. వారు బందురులోని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారం చేసిన నాగబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : 5 నెలల గర్భవతి అని కూడా కనికరం చూపించలేదు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.