ప్రపంచ వ్యాప్తంగా మహిళలను ఏదో విధంగా వంచించి మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ప్రేమ పేరుతో, అదనపు కట్నం కోసమని వేధింపులకు పాల్పడుతున్నారు. కొంతమంది సినిమాల్లో నటించే అవకాశాలు కల్పిస్తామని నమ్మించి యువతుల పట్ల అఘాయిత్యాలకు పాల్పడిన సంఘటనలు కూడా వెలుగు చూశాయి. ఇదే విధంగా ఓ నటుడు యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కేసులలో విచారణ జరిపిన న్యాయస్థానం అతనికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

డానీ మాస్టర్ సన్ అమెరికాకు చెందిన నటుడు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. నాలుగేళ్ల వయసు నుంచే చైల్డ్ మోడల్ గా, వాణిజ్య ప్రకటనలలో నటించాడు. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దట్ సెవంటీస్ షో నటుడు డానీ మాస్టర్ సన్ ను కోర్టు నిందితుడుగా తేల్చింది. పలువురు యువతులపై అత్యాచారాలకు పాల్పడినందుకు ఆ నటుడికి 30ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇదిలా ఉండగా యువతులపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న డానీ మాస్టర్ సన్ ను 2017లో నెట్ ఫ్లిక్స్ ది రాంచ్ అనే కామెడీ ప్రోగ్రం నుంచి తొలగించింది. అయితే డానీ మాస్టర్ సన్ 2001లో 23 ఏళ్ల వయసున్న ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
2003లో 28 ఏళ్ల యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మళ్లీ 2003వ సంవత్సరం చివరలో 23 ఏళ్ల వయసున్న మరో యువతిపై అత్యారానికి పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులపై న్యాయస్థానం 2020లో విచారణ జరిపి జైలు శిక్ష విధించింది. దీంతో డానీ మాస్టర్ సన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే డానీ మాస్టర్ సన్ 3.3మిలియన్ డాలర్లు చెల్లించి జైలు నుంచి విడుదలయ్యారు. దీనిపై బాధితులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తాజాగా విచారణ జరిపిన కోర్టు డానీ మాస్టర్ సన్ ను నిందితుడిగా తేల్చి 30 ఏళ్లు జైలు శిక్షను విధించింది. కోర్టులో న్యాయమూర్తి తీర్పు ప్రకటించిన సమయంలో డానీ మాస్టర్ సన్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోగా, ఆయన భార్య బిజు ఫిలిప్స్ న్యాయస్థానంలోనే విలపించింది.