Crime News : అనుమానం ప్రాణ సంకటం.. ఒక్కసారి బుర్రలో మొదలైతే అంత త్వరగా పోదు. దాంపత్య జీవితంలో అనుమానం ఎన్నో దారుణాలకు దారి తీస్తోంది. భార్యపై భర్తకు అనుమానం వచ్చినా.. భర్తకు భార్యపై అనుమానం వచ్చినా నాశనం అయ్యేది మాత్రం ఓ కుటుంబం. ఓ క్యాబ్ డ్రైవర్ తన భార్య అక్రమ సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో దారుణానికి ఒడిగట్టాడు. కన్న కూతురి మందే భార్యను చంపేశాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు కలప్పకు చెందిన నీలకంఠ, నాగమ్మ భార్యాభర్తలు.
నీలకంఠ క్యాబ్ డ్రైవర్ కాగా, నాగమ్మ ఓ ప్రైవేట్ ఆఫీసులో హౌస్ కీపర్‌గా పనిచేస్తోంది. నాగమ్మ అక్రమ సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో నీలకంఠ తరుచూ ఆమెతో గొడవలు పడేవాడు. సోమవారం రాత్రి ఇద్దరికీ గొడవైంది. ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ విషయం ఆమె తన సోదరి పార్వతికి ఫోన్ చేసి చెప్పింది. తాను చనిపోతే భర్త మరో పెళ్లి చేసుకుంటున్నానంటున్నాడని అంది. పార్వతి, నాగమ్మకు సర్థి చెప్పి ఉదయం వరకు మౌనంగా ఉండాలని కోరింది. ఉదయం తాను నేరుగా వచ్చి కలిసి విషయంపై మాట్లాడతానని చెప్పింది.
ఆమె ఫోన్ పెట్టేసిన తర్వాత మరోసారి నాగమ్మ, నీలకంఠకు గొడవైంది. నీలకంఠ ఎనిమిది సంవత్సరాల కూతురు ముందే భార్య గొంతుకు బెల్టు బిగించి చంపేశాడు. ఆ చిన్నారి తల్లి చనిపోయిన విషయాన్ని పార్వతికి ఫోన్ చేసి చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నీలకంఠను గత బుధవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : పాపను స్నాక్స్ కొనిస్తానని తీసుకెళ్లాడు.. ఇటుకతో కొట్టి చంపి..
పోర్న్ చూసి రెచ్చిపోయారు.. పొలంలోని బాలికలపై..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.