crime news : పెళ్లి పేరుతో ఓ లేడీ కానిస్టేబుల్‌ను వసపర్చుకున్న ఓ ఎస్‌ఐ దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లి పేరు చెప్పి ఆమెను పలుమార్లు రేప్ చేసి, గర్భవతి అయిన తర్వాత బలవంతంగా అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోమన్నందుకు టార్చర్ పెట్టాడు. అతడి చేతిలో మోసపోయిన సదరు లేడీ కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐకి వ్యతిరేకంగా న్యాయపోరాటం మొదలుపెట్టింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆర్. మధుసూదన్ అనే వ్యక్తి బెంగళూరులోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు.
అతడికి 2017లో ఓ లేడీ కానిస్టేబుల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. మధుసూదన్ ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఓ రోజు ఆమెను బెంగళూరు బయట ఉన్న ఓ రిసార్ట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ బలవంతంగా ఆమెను రేప్ చేశాడు. రేప్ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని ప్రాధేయపడ్డాడు. కచ్చితంగా ఆమెను పెళ్లి చేసుకుంటానని వాగ్ధానం చేశాడు. ఇక అప్పటినుంచి ఆమెతో శృంగారంలో పాల్గొనేవాడు. 2019లో ఆమె గర్భం దాల్చింది. ఇది తెలిసిన అతడు ఆమెను చిక్‌బళ్లాపూర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ బలవంతంగా గర్భనిరోధక మాత్రలు మింగించాడు.
గర్భం పోలేదు కానీ, ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమెను కోలార్ ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. ఆమెను మూదలపాళ్యలోని ఓ అద్దె ఇంట్లో ఉంచి అనుభవించసాగాడు. ఆమె మళ్లీ గర్భం దాల్చింది. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆమె పట్టుబట్టింది. ఆగ్రహానికి గురైన మధుసూధన్ కాలితో ఆమె కడుపుపై తన్నాడు. మరోసారి అబార్షన్ అయ్యింది. గత నెల 19వ తేదీన ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అతడి వేధింపులు భరించలేకపోయిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. మధుసూధన్‌పై ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు గోవిందరాజనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : జనవరిలో ప్రేమ పెళ్లి.. 3 రోజుల క్రితం మాయమైన భర్త..
ప్రియుడ్ని తాళ్లతో కట్టేసి.. ప్రేయసిని తోటలోకి ఎత్తుకెళ్లి..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.