ఇటీవల జరుగుతున్న దారుణాలు చూస్తుంటే.. సినిమా కథకు ఏ మాత్రం తీసిపోవు. హత్య లేదా ఆత్మహత్యకు దారి తీస్తున్న ట్విస్టులు చూస్తుంటే మతిపోవడం ఖాయం. అయిన వాళ్లే, బాగా తెలిసిన వ్యక్తులే తమ సొంత వారిని హత్య చేసి, ఆ తర్వాత ఏ మాత్రం తెలియనట్లు ఆస్కార్ రేంజ్ నటనను ప్రదర్శిస్తున్నారు.
ఇటీవల జరుగుతున్న దారుణాలు చూస్తుంటే.. సినిమా కథకు ఏ మాత్రం తీసిపోవు. హత్య లేదా ఆత్మహత్యకు దారి తీస్తున్న ట్విస్టులు చూస్తుంటే మతిపోవడం ఖాయం. అయిన వాళ్లే, బాగా తెలిసిన వ్యక్తులే తమ సొంత వారిని హత్య చేసి, ఆ తర్వాత ఏ మాత్రం తెలియనట్లు ఆస్కార్ రేంజ్ నటనను ప్రదర్శిస్తున్నారు. అలాంటి ఉదాహరణే మొన్న ప్రకాశం జిల్లాకు చెందిన రాధ అనే యువతిని స్నేహితుడు చంపేశాడని అందరూ భావించారు. కానీ భర్తే.. ఆమెపై అనుమానం పెంచుకుని కాలయముడిగా మారాడన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా మరొక ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
కొత్తగా పెళ్లైన వరుడు.. సెలవు రోజు కావడం అత్తమామల వద్దకు వచ్చాడు. మరుసటి రోజే హత్యకు గురయ్యాడు. ఈ విషయంపై విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. సూరజ్, కల్పన నూతన వధూవరులు. వీరికి పెళ్లై మూడు నెలలే అవుతుంది. సూరజ్ ఓ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లయిన తర్వాత సూరజ్ శారీరకంగా కల్పనను వేధించడం మొదలు పెట్టాడు. తీవ్రంగా కొట్టేవాడు. ఈ బాధను భరించలేక.. అతడిని హత్య చేయాలని ప్రణాళిక వేసింది. అయితే ఆదివారం సెలవు రోజు కావడంతో అత్తామామల ఇంటికి వచ్చాడు సూరజ్. అయితే భర్తను వాకింగ్‌కు వెళదామని తీసుకెళ్లిన భార్య బయటకు తీసుకెళ్లింది.
ఇద్దరు పొలాల్లోకి వెళ్లగా.. అక్కడే అతడిని చంపేందుకు ఏర్పాటు మనుషుల్ని ఏర్పాటు చేయించింది. అక్కడకు వెళ్లగానే.. ఆ ముగ్గురు భర్తపై ఆయుధాలతో ఎటాక్ చేశారు. ఒంటిపై నగలు తీసుకెళ్లారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు వెళ్లి కేసు నమోదు చేశారు. తొలుత దోపిడీ కోసమే ఈ హత్య చేశారని భావించగా.. తర్వాత తమదైన స్టైల్లో పోలీసులు విచారించగా.. భార్య అతడిని హత్య చేయించిందని తేలింది. తనను కొట్టడంతో పాటు మానసికంగా హింసించినందుకే ఈ హత్య చేయించినట్లు భార్య కల్పన పేర్కొంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన భార్యను తలేగావ్ దభాడే పోలీసులు అరెస్ట్ చేశారు.