ప్రేమ పేరుతో అనేక మంది యువతులు మోసపోతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆడపిల్లలు ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రేమ, పెళ్లి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదు. అయినప్పటికీ మోసగాళ్ల మాయ మాటలకు లొంగిపోతున్నారు
ప్రపంచంలో అందమైన ఫీలింగ్ ప్రేమ. అమ్మాయి, అబ్బాయి తియ్యటి మానసిక సంఘర్షణనను ప్రేమ అని పేరు పెట్టుకుని ‘వి ఆర్ ఇన్ లవ్’ అంటూ చెట్ట పట్టాలేసుకుని తిరుగుతుంటారు. ప్రేమ మత్తుల్లో జోగుతుంటారు. ప్రేమ పేరుతో అనేక మంది యువతులు మోసపోతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆడపిల్లలు ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రేమ, పెళ్లి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదు. అయినప్పటికీ మోసగాళ్ల మాయ మాటలకు లొంగిపోతున్నారు. చివరకు శారీరకంగా దగ్గరవుతున్నారు. పెళ్లి విషయం వచ్చే సరికి పెద్దలు అంగీకరించడం లేదని, లేదా కుల, మతాల పేర్లు చెప్పి ప్రేమించిన అమ్మాయికి బ్రేకప్ చెప్పేస్తున్నారు. అమృతది ఇదే కథ.
ప్రేమించిన యువకుడితో శారీరకంగా దగ్గరయ్యాక.. కులం పేరుతో వివాహానికి నిరాకరించడంతో అమృత అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని బళ్లారిలో చోటుచేసుకుంది. చనిపోయే ముందు సూసైట్ నోటులో ప్రియుడు చేసిన మోసం గురించి ప్రస్తావించింది. వివర్లాలోకి వెళితే.. బళ్లారికి చెందిన అమృతకు తన స్నేహితురాలి మరిది సునీల్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ శారీరకంగా బాగా దగ్గరయ్యారు. యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే కులం అడ్డు వచ్చింది. యువతితో శారీరక సంబంధం పెట్టుకునేందుకు అడ్డురాని కులం.. పెళ్లి అనేసరికి వచ్చింది.
ఇదే విషయంపై సునీల్‌ను నిలదీసింది. అయినప్పటకీ ప్రేమికుడు హ్యాండ్ ఇవ్వడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. అయితే కొన ఊపిరితో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఆమె రాసిన లేఖ పోలీసులకు దొరికింది. ప్రేమ పేరుతో తనను సునీల్ లొంగదీసుకున్నాడని, ఇప్పుడు కులం తక్కువ అంటూ పెళ్లికి నిరాకరించాడంటూ అందులో పేర్కొంది. అతడి కుటుంబ సభ్యులు కూడా అవమానించారంటూ పేర్కొంది. ఈ కేసులో సునీల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తదుపరి విచారణ చేపడుతున్నారు.