మొన్నటి వరకు కరోనా అంటే భయపడే జనాలు ఇప్పుడు గుండెపోటు అనే పదం వినిపిస్తే వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఇటీవల గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వాళ్లు హఠాత్తుగా కన్నుమూయడంతో బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
ఇప్పుడు దేశ వ్యాప్తంగా గుండెపోటు అన్న పేరు వినిపిస్తే చాటు భయంతో వణికిపోతున్నారు. ఈ మద్య చిన్నా పెద్ద అనే తేడా లేకుండా వరుసగా గుండెపోటుతో మృతి చెందడంలో ప్రజల్లో ఆందోళన మొదలైంది. గుండెపోటు, హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ పేరు ఎదైనా.. ఇది వచ్చిన జనాలు ఉన్నచోటు కుప్పకూలి చనిపోతున్నారు. ఆ క్షణం వరకు మనతో సంతోషంగా గడిపిన వాళ్లు హఠాత్తుగా చనిపోవడంతో బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తాజాగా ఓ పదవతరగతి విద్యార్థిని తన స్నేహితురాళ్లతో సంతోషంగా గడిపి హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూసింది.. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలో ఇందాపూర్ లో సృష్టి ఏకాద్ ఆమె వయసు 16 సంవత్సరాలు. నారాయణదాస్ రాందాస్ పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతుంది. ప్రస్తుతం ఇక్కడ పరీక్షలు జరుగుతున్నాయి. మార్చి 13 న సృష్టికి చివరి పరీక్ష.. తన ఫ్రెండ్స్ తో జోక్స్ వేస్తూ.. ఎంతో సంతోషంగా గడిపింది. అదే సమయంలో అక్కడే కుప్పకూలిపోయింది. దాంతో సృష్టి ఫ్రెండ్ ఒక్కసారే భయపడిపోయారు.. ఎంత లేపినా ఆమెలో చలనం లేదు. వెంటనే స్కూల్ సిబ్బంది సృస్టిని దగ్గరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. విషయాన్ని సృష్టి తల్లిదండ్రులకు తెలియజేశారు. వెంటనే వారు ఆస్పత్రికి వచ్చి తమ కూతురుని చూసి నిర్ఘాంతపోయారు.. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలపడంతో గుండెలు పగిలేలా రోదించారు.
సృష్టి ఏకాద్ మొదటి నుంచి చదువులో ఫస్ట్.. ఎంతో యాక్టీవ్ గా ఉండేదని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అసలు తమ బిడ్డకు గుండెపోటు ఎలా వచ్చిందో అంతుబట్టడం లేదని అన్నారు. సృష్టికి ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా లేవని.. ప్రస్తుతం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ లో ఉందని.. మార్చి 12న తన ఫ్రెండ్స్ తో ఎంతో జాలీగా గడిపిందని.. అలా మాట్లాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పడంతో షాక్ తిన్నట్లు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
ఇటీవల తెలుగు రాష్ట్రల్లో సైతం చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారు హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోతున్నారు.. ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోపు కన్నుముస్తున్నారు. రెండు రోజుల ముందే అమెరికాలో 23 ఏళ్ల బొడగల వంశీ రెడ్డయ్య అనే తెలుగు విద్యార్థి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. తెలంగాణలో వరుస మరణాలు సంబవిస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన మురళీ కృష్ణ అనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయి హార్ట్ ఎటాక్ చనిపోయాడు. ఇలా యూత్ హార్ట్ ఎటాక్ తో చనిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.