ఈ రోజుల్లో కొందరు మహిళలు పెళ్లై పిల్లలు ఉన్నా కూడా మరో మగాడి కోసం ఆరాటపడుతున్నారు. తాళికట్టిన భర్తను, పిల్లలను సైతం కాదని క్షణిక సుఖం కోసం వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకుంటూ చివరికి హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే భర్తను కాదని రంకు మొగుడి కోసం వెళ్లిన మహిళకు ప్రియుడు ఊహించని షాక్ ఇచ్చాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది చెన్నైలోని మాంగాడు ప్రాంతం. ఇక్కడే నివాసం ఉంటున్న నిత్య (30)కు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పటి వరకు నిత్య జీవితం సాఫీగా సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే నిత్యకు తిరువణ్ణామలై జిల్లాకు చెందిన తంగరాజ్ అనే వ్యక్తి ఫేస్ బుల్ లో పరిచయం అయ్యాడు. ఇతనికి పెళ్లై ముగ్గురు పిల్లలున్నారు. ఈ పరిచయంతోనే నిత్య తరుచు తంగరాజ్ తో మాట్లాడుతుండేది. ఈ క్రమంలోనే వీరిద్దరి పరిచయం మరింత బలంగా మారి చివరికి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇక నిత్య భర్తకన్న ప్రియుడే ఎక్కువ అనే రీతిలో ఊహించుకుంటుంది. అయితే నిత్య సాగిస్తున్న చీకటి ప్రేమాయణం చివరికి భర్తకు తెలిసింది. కోపంతో ఊగిపోయిన భర్త భార్య నిత్యకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.
అయినా నిత్య తన వక్రబుద్ది మాత్రం మార్చుకోలేదు. ఈ క్రమంలోనే నిత్య భర్తను కాదని ప్రియుడి వద్దకు వెళ్లాలనుకుంది. ఇక ఇందులో భాగంగానే నిత్య ఇటీవల భర్తను, పిల్లలను వదిలేసి ప్రియుడు తంగరాజ్ వద్దకు వెళ్లింది. దీనిని గమనించిన తంగరాజ్ భార్య నువ్వు ఎవరూ అంటూ నిత్యను నిలదీసింది. అసలు విషయం తెలుసుకున్న తంగరాజ్ భార్య.. నాతో ఉంటావో, నిత్యతో ఉంటావో తేల్చుకోవాలంటూ భర్త తంగరాజ్ సూటిగా ప్రశ్నించి. దీంతో తంగరాజ్ ప్రియురాలికి నచ్చచెప్పి ఆమె భర్త వద్దకు పంపాలని ప్రయత్నించాడు.
కానీ నిత్య మాత్రం ప్రియుడి మాటలు వినకుండా నీతోనే ఉంటానంటూ తెగేసి చెప్పింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక కోపంతో ఊగిపోయిన తంగరాజ్ ప్రియురాలు నిత్య గొంతుకు ఉరేసి హత్య చేశాడు. ఈ విషయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిత్య మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టంకు తరలించారు. అనంతరం ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.