అతనంటే ఆ అమ్మాయికి ఎంతో ఇష్టం, ఆ అమ్మాయి అంటే కూడా అతడికి చాలా ఇష్టం. ఇద్దరూ గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రేమికులు కలుసుకోక చాలా రోజులు అవుతుంది. బయట ఎక్కడైనా కలుసుకుందామనుకున్నారు. కానీ, వీలు పడలేదు. దీంతో ఇలా కాదని భావించిన ప్రియుడు.. ఇటీవల ఏకంగా ప్రియురాలి ఇంటికి చేరుకుని టెర్రస్ పైకి వెళ్లాడు. ఇక ఇద్దరు మాట్లాడుకుంటుండగా.. ప్రియురాలి తల్లి సడెన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
తమిళనాడులోని సేలం జిల్లా ధర్మపురిలోని కామరాజ్ నగర్. ఇక్కడే సంజయ్ (18) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే ఇతనికి స్థానికంగా ఉండే ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే రోజూ వీళ్లిద్దరూ బయట కలుసుకునేవారు. కానీ, గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరికి కలుసుకోవడం వీలు కావడం లేదు. దీంతో సంజయ్ ఎలాగైన తన ప్రియురాలిని కలుసుకోవాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ప్రియుడు ఇటీవల ప్రియురాలి ఇంటికి చేరుకుని టెర్రస్ పైకి వెళ్లాడు.
దీంతో ఇద్దరు అలా మాట్లాడుకుంటుండగా.. ప్రియురాలి తల్లి సడెన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో ప్రియురాలి తల్లిని నుంచి తప్పించుకోవడానికి సంజయ్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక ఆ టెర్రస్ పై నుంచి కిందకు దూకి తీవ్రంగా గాయపడ్డాడు. దీనిని గమనించిన స్థానికులు అతడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక చికిత్స పొందుతూ చివరికి సంజయ్ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఈఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.