అన్ని ప్రేమల కన్నా యువతీ యువకుల మధ్య ప్రేమ గాఢంగా ఉంటుంది. వీరి మధ్య సాన్నిహిత్యాన్ని ప్రేమకు నిర్వచనంగా చెబుతారు. ఇద్దరు ఇష్టపడ్డాక జంట పక్షుల్లా విహరిస్తారు. వీరికి సమయం తెలియదు, ప్రపంచంతో సంబంధం ఉండదు. మాటలకు హద్దు, పొద్దులుండవు. పెళ్లి చేసుకునే విషయానికి
అందమైన తియ్యని బాధ ప్రేమ. జగమంతా ప్రేమమయం అంటారు కవులు. ప్రేమ లేనిదే ప్రపంచం, మానవ జాతి లేదని చెబుతుంటారు. అయితే అన్ని ప్రేమల కన్నా యువతీ యువకుల మధ్య ప్రేమ గాఢంగా ఉంటుంది. వీరి మధ్య సాన్నిహిత్యాన్ని ప్రేమకు నిర్వచనంగా చెబుతారు. ఇద్దరు ఇష్టపడ్డాక జంట పక్షుల్లా విహరిస్తారు. వీరికి సమయం తెలియదు, ప్రపంచంతో సంబంధం ఉండదు. మాటలకు హద్దు, పొద్దులుండవు. పెళ్లి చేసుకునే విషయానికి వచ్చేసరికి పెద్దలు వీరి ప్రేమను అంగీకరించకపోవడంతో.. వీరి కథ విషాదంగా ముగుస్తుంది. ప్రేమించిన వ్యక్తికి మరొకరితో వివాహం జరగడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. వారి లేని జీవితం వ్యర్థం అని బలవన్మరణానికి పాల్పడుతున్నారు.
ప్రేమికులద్దరికీ ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలని కల. దాని కోసం ప్రిపేర్ కూడా అవుతున్నారు. అయితే అంతలో ప్రేయసి వివాహం అతడిని మానసికంగా కుంగదీసింది. ఆమె లేని జీవితం ఊహించలేని అతడు.. ప్రేయసి పెళ్లి రోజే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమికుడు బలవన్మరణాన్ని తట్టుకోలేక ప్రేయసి కూడా ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ ప్రేమ కథ విషాదంగా ముగిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘోరీమన్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని షోభాలా జైత్ మాలాకు చెందిన అనిత, పూర్ణారామ్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ కాంపిటీటీవ్ పరీక్షల కోసం సిద్ధం అవుతున్నారు. అయితే అనితకు ఈ నెల 4న మరొకరితో వివాహం జరిగింది. తీవ్రంగా కలత చెందిన ప్రియుడు పూర్ణ అదే రోజు గ్రామంలోని కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషయం తెలిసిన ప్రేయసి తట్టుకోలేకపోయింది. పాలు తీసుకు వచ్చేందుకు పశువుల పాకకు వెళ్లిన ఆమె ఎంతకూ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె వెతకగా.. ఓ బావి వద్ద పాల పాత్ర కనిపించింది. దీంతో వారు అనుమానంతో బావిలోకి చూడగా.. అనిత మృతదేహం కనిపించింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సోషల్ మీడియాలో ప్రియుడి ఫోటోతో పాటు అతడిని ఉద్దేశించి సందేశం రాసింది. ‘మనం జీవించినా, మరణించినా కలిసే ఉండాలని ప్రమాణాలు చేసుకున్నాం. నన్నెందుకు ఒంటరిగా ఈ క్రూరమైన ప్రపంచంలో వదిలి వెళ్లిపోయావు. మరేం పర్వాలేదు, ఇప్పుడు నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తున్నా. రెండు రోజులు ఆలస్యం అయ్యింది. క్షమించు డియర్’అని రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.