విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి మంచి మార్గాన నడిపించాల్సిన గురవులే తప్పుడుదోవలో నడుస్తుంటే సమాజం ఎటుపోతుంది? సమాజంలో విలువలు, బాధ్యతలు నేర్పించాల్సిన టీచర్లే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. పుణెలోని ఓ స్కూల్ ప్రిన్సిపాల్ చేసిన నిర్వాకం గురించి తెలుసుకుందాం.
ఆడపిల్లలకు ఎక్కడ వెళ్లినా రక్షణ లేకుండా పోతుంది. ఈ మధ్యకాలంలో స్కూల్ పిల్లలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి.అభంశుభం తెలియని ఆడపిల్లలు లైంగికంగా వేధింపులకు గురవుతున్నారు. విద్యాబుద్దులు చెప్పాల్సిన గురువు స్థానంలో ఉన్నవారే ఇలా మృగాళ్లా ప్రవర్తిస్తుంటే ఆడపిల్లలకు రక్షణ ఎక్కడుంటుంది? ఈ రోజుల్లో స్కూల్‌లో బస్సు డ్రైవర్, టీచర్లు ఆఫీస్ బాయ్‌లు ఎవ్వరిని నమ్మడానికి వీల్లేకుండా పోయింది. విద్యార్థుల మనస్థత్వాలను గుర్తించి వారిని మంచి మార్గాన నడిపించే కొందరు టీచర్లే కీచకులై వేధిస్తున్నారు.
తాజాగా పూణేలో ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ స్కూల్ బాలికల టాయిలెట్స్‌లో సీసీకెమెరాలను అమర్చారు. అది గమనించిన విద్యార్థినులు విషయాన్ని తమ పేరెంట్స్‌కి తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ప్రిన్సిపాల్‌కు దేహశుద్ధి చేశారు. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర పుణేలోని తాలెగావ్‌లోని డీవై పాటిల్ స్కూల్‌లో ఈ మధ్యకాలంలో సీసీటీవీ కెమెరాలు అమర్చారు. బాలికల వాష్‌రూమ్‌లో కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేశారు. అయితే ఇది గమనించిన విద్యార్థినులు కెమెరాల గురించి తమ తల్లిదండ్రులకు తెలియజేశారు.
అంతేకాకుండా విద్యార్థులతో బలవంతంగా క్రైస్తవ ప్రార్థనలు చేయిస్తున్నారని బాలికలు తమ పేరెంట్స్‌కు తెలిపారు. విషయం తెలిసి పేరెంట్స్, స్థానికులు ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌పై దాడి చేసి చితకబాదారు. తల్లిదండ్రులు, స్థానికులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని చూపించి విద్యార్థినులను బెదిరించి క్రైస్తవ మత మార్పిడికి పాల్పడే చాన్స్ ఉందని తల్లిదండ్రులు అధికారులకు కంప్లైంట్ చేశారు. విద్యాశాఖ అధికారులు స్పందించి స్కూల్ ప్రిన్సిపాల్‌పై తగిన చర్యలు తీసుకుంటామని పేరెంట్స్‌కు హామీ ఇచ్చారు.