సిటీల్లో కల్తీ బాగా పెరిగిపోయింది. తినుబండారాల విషయంలో కల్తీకారులు రెచ్చిపోతున్నారు. ఇష్టం వచ్చినట్లు అన్నిటినీ కల్తీ చేసేస్తున్నారు. బిర్యానీ లాంటి డిమాండ్ ఉన్న వంటకాల విషయం అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. వెజ్ బిర్యానీ సంగతి పక్కన పెడితే.. నాన్ వెజ్ బిర్యానీ తినడానికి నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఆసక్తిచూపిస్తుంటారు. కొంతమంది ప్రతీ రోజూ బిర్యానీ తింటూ ఉంటారు. ఓ పూట బిర్యానీ తినకపోతే ఉండలేము అనుకునే వారు కూడా ఉన్నారు. అయితే, బిర్యానీ తయారీ విషయంలో పరిశుభ్రత లోపిస్తోంది. ఈ మధ్య కాలంలో నాజ్ వెజ్ బిర్యానీల్లో కల్తీలు ఎక్కవయిపోయాయి. కుళ్లిపోయిన మాంసంతో పాటు.. కుక్కలు, పిల్లుల మాంసంతో బిర్యానీలు చేస్తూ ఉన్నారు. వీధి కుక్కలు, పిల్లుల్ని పట్టి వాటిని హోటళ్లకు విక్రయిస్తున్నారు. హోటళ్ల వారు వాటిని కోసి కూర వండేస్తున్నారు.
తాజాగా, చెన్నైలోని పలు హోటళ్లలో పిల్లుల మాంసంతో బిర్యానీ తయారు అవుతున్నట్లు తెలియవచ్చింది. వాటితో మటన్ చుక్కా, మటన్ కోలా రోల్, మటన్ బిర్యానీల వంటివి చేస్తున్నారంట. పుష్పవాణి అనే జంతు ప్రేమికురాలు ఓ ఇద్దరు వ్యక్తులు పిల్లల్ని పట్టడం చూసింది. దీనిపై చెన్నైలోని ఇలు గినరు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓ టీం ఆమె చెప్పిన చోటుకు వెళ్లి చూడగా.. బోనుల్లో 11 పిల్లులు దర్శనమిచ్చాయి. వాటిని జంతు సంరక్షణాలయానికి తరలించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఏంటంటే.. ఓ గ్రూపు ఉదయం పూట పిల్లుల దొంగతనానికి వెళుతోంది.
వాటిని పట్టి తెచ్చి చంపేస్తున్నారు. తర్వాత వాటి తోలు తీసి, మాంసాన్ని మటన్‌లో కలిపేస్తున్నారు. మరికొన్ని పిల్లుల్ని నేరుగా హోటళ్ల వారికి విక్రయిస్తున్నారు. అయితే, ఇది ప్రతీ హోటళ్లలో జరగటం లేదు. దీనిపై జంతు ప్రేమికురాలు శ్రీవాణి మాట్లాడుతూ.. ‘‘మూడేళ్ల క్రితం నేను పల్లవరం మార్కెట్‌కు వెళ్లి చూశాను. ఓ పిల్లిని చంపి వండారు. మరికొన్నింటిని బోనులో ఉంచారు. వాటి మాంసంతో బిర్యానీ చేసి రోడ్డు పక్కన కొట్టుల్లో అమ్ముతున్నారు. ఇప్పటివరకు మేము పట్టుకున్న పిల్లల్ని సంరక్షాణాలయంలో ఉంచాము’’ అని తెలిపారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.