వాళ్లిద్దరూ అన్నా చెల్లెళ్లు. పండగలు, ఫంక్షన్ లు ఇలా ఏ సందర్భం వచ్చినా.. ఇద్దరు కలుసుకుంటారు. అన్నా, చెల్లెలు కావడంతో ఇద్దరు కాస్త క్లోజ్ గా మూవ్ అయ్యారు. చెల్లి ఇంటికి అన్న వెళ్లడం, అన్న ఇంటికి చెల్లి వెళ్లడం. ఇలా ఈ అన్నాచెల్లెల్ల ఇద్దరూ కలిసి తిరిగారు. తల్లిదండ్రులు కూడా పెద్దగా అనుమానించలేదు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.., ఉన్నట్టుండి ఈ అన్నాచెల్లెలు ఇద్దరూ లాడ్జ్ లో శవాలై కనిపించారు. తాజాగా బెంగుళూరులో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
అది కర్ణాటకలోని ధారవాడలోని బెళవి గ్రామం. ఇక్కడే కుమార్ అనే యువకుడు నివాసం ఉండగా, నీరలకట్టే గ్రామంలో దీపా అనే యువతి నివాసం ఉంటుంది. వీళ్లద్దరి తల్లులు సొంత అక్కాచెల్లెలు. దీంతో పండగలు, పెళ్లిళ్లు ఏది జరిగినా.. అంతా కలిసి మెలిసి ఉంటారు. అయితే కుమార్, దీపా అన్నా, చెల్లులు కావడంతో ఇద్దరూ కాస్త క్లోజ్ గా ఉండేవారు. ఇదిలా ఉంటే ఇటీవల కుమార్ కు బెంగుళూరు జాబ్ వచ్చిందని తన చెల్లెలు అయినా దీపా వాళ్ల ఇంటికి వెళ్లి అక్కడే ఉంటున్నాడు. దీంతో తన చిన్నమ్మ, బాబాయ్ తో కలిసి మెలిసి సంతోషంగానే ఉంటున్నాడు.
కట్ చేస్తే గత డిసెంబర్ 5న బెంగుళూరులో పనుందని కుమార్ వారి ఇంటి నుంచి వెళ్లాడు. దీపా కూడా నాకు పనుందని కుమార్ వెళ్లిన రోజే ఇంటి నుంచి బయటకు వెళ్లింది. విషయం ఏంటంటే? డిసెంబర్ 5న అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి ధారవాడలోని ఓ లాడ్జ్ లో దిగారు. ఆ అన్నా చెల్లెలు రెండు రోజుల పాటు అదే లాడ్జ్ లోనే ఉన్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. లాడ్జ్ లోని ఓ రూమ్ లో అన్నా చెల్లెలు ఒకే ఫ్యానుకు వేలాడుతూ శవాలై కనిపించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. అసలు ఈ అన్నా చెల్లులు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.