కామాంధుల అకృత్యాలను అద్దం పట్టే వార్త ఇది. బ్రిటన్ కు చెందిన డేవిడ్ పుల్లర్ అనే కీచకుడు, గతేడాది ఇద్దరు మహిళలను హత్య చేసి, మార్చురీలలోని 23 శవాలను లైంగికంగా వేధించిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ తరువాత అతడు నేరాన్ని అంగీకరించడంతో ఇప్పటికీ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే ఈ కేసులో ఇంకా విచారణ సాగుతున్న నేపథ్యంలో పోలీసులు ఎప్పటికప్పుడు అతని నుంచి మరిన్ని విషయాలు రాబట్టేందుకు ప్రయత్నించగా, భయంకరమైన విషయాలు బయటకొచ్చాయి.
డేవిడ్ ఫుల్లర్ అనే వ్యక్తి 1987లో ఆగ్నేయ ఇంగ్లాండ్ ప్రాతంలోని కెంట్ పరిసరాల్లో ఉన్న ఒక ఆసుపత్రిలో ఎలక్ట్రీషియన్ గా పనిచేసేవాడు. ఆరోజుల్లో ఆసుపత్రికి సమీపాన నివాముంటున్న వెండీ కెనెల్(25), కరోలిన్ పియర్స్(20) ఇద్దరిని నెలల వ్యవధిలో గొంతు కోసి చంపాడు. ఆ తరువాత వారిపై హత్యాచారం చేసినట్లు ఆరోపణులు. అంతేకాదు.. అతను పనిచేసిన ఆసుపత్రి మార్చురీలలో చనిపోయిన 23 మంది మహిళలను లైంగికంగా వేధించిన కేసులో గతేడాది అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో ఇప్పటికే ఊచలు లెక్కపెడుతున్నాడు. అయితే ఈ కేసులో మరిన్ని విషయాలను రాబట్టే ప్రయత్నం చేసిన పోలీసులు, అతని ఇంట్లో సోదాలు చేయగా విస్తుపోయే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
పుల్లర్ 1987 నుంచి ఆస్పత్రి ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ లో పనిచేస్తుండగా, రెండు మార్చురీలో శవాలపై తాను చేసే కీచక పని దృష్ట్యాలను స్వయంగా చిత్రీకరించాడు. చిన్న పిల్లల మృతదేహాలను కూడా వదల్లేదు ఆ దుర్మార్గుడు. 2008 నుంచి 2020 మధ్య మార్చురీలలో 78 మృతదేహాలపై పుల్లర్ లైంగిక దాడికి పాల్పడినట్లు అంగీకరించాడు. దీంతో ఆ కామాంధుడు మొత్తం 101 మృతదేహాలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. ఈ కీచకుడి నేరాలపై గురువారం క్రౌన్ కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో న్యాయమూర్తి బాబీ చీమా గ్రబ్ నిందితుడిని విచారిస్తూ.. గతేడాది నిందితుడు డేవిడ్ పుల్లర్ హత్యానేరం కింద శిక్ష విధించబడినప్పుడు సామాన్యమైన, సాధారణ జీవితాన్ని గడుపుతున్నట్లు కనిపించాడని, ఈ దుర్మార్గుడి నేరాలు ఇప్పుడు ప్రపంచానికి తెలియాసిని తెలిపారు.
David Fuller has pleaded guilty to a further 16 charges in relation to sexual offences committed in a mortuary setting. Fuller will be sentenced at the Old Bailey during the week commencing 5 December. https://t.co/BAIj2QBZZf pic.twitter.com/pzU4hosEyX
— Kent Police (UK) (@kent_police) November 3, 2022