అది రాజస్థాన్‌లోని జైపూర్ పరిధి జైపూర్జిల్లా కోట్‌పుట్లీ ప్రాంతం. బంధువుల సమక్షంలో కుమారుడి వివాహం ఘనంగా చేశారు. వారి ఆచారం ప్రకారం శోభనం కూడా జరిగింది. కానీ శోభనం మరుసటి రోజే కొత్త కోడలు ఇచ్చిన ఊహించని షాక్ తో అంతా ఆస్పత్రి పాలయ్యారు. కోడలు చేసిన ఘనకార్యంతో పోలీసులు సైతం బిత్తరపోయారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
రాజస్థాన్‌లోని జైపూర్ పరిధి జైపూర్జిల్లా కోట్‌పుట్లీ ప్రాంతం. ఇటీవల కాలంలోనే ఓ జంటకు వివాహం జరిగింది. బంధువుల రాకతో ఇళ్లంతా పండగా వాతావరణంలా మారిపోయింది. పెళ్లైన మరుసటి రోజు వారి సాంప్రదాయం ప్రకారం శోభనానికి అంతా రెడీ చేశారు. ఇక ఆ రోజు రాత్రి కొత్త కోడలు వరుడుతో పాటు పెళ్లికి వచ్చిన బంధువులకు తన చేతులతోనే వడ్డించి పెట్టి తను మాత్రం తినలేదు. శోభనం కూడా జరిగింది. తెల్లారింది ఉదయం సమయం 8 కావొస్తుంది వరుడితో పాటు పెళ్లికి వచ్చిన బంధువులు, అత్తింటివాళ్లు ఒక్కరు కూడా నిద్రలేవలేదు.
ఇది కూడా చదవండి: గర్భంతో ఉన్న మేకపై ముగ్గురు వ్యక్తుల దారుణం!
దీంతో అనుమానం వచ్చిన పక్కింటివాళ్లు వెంటనే వెళ్లి చూసేసరికి ఎక్కడివాళ్లు అక్కడే పడి ఉండి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. కోడలి జాడ మాత్రం లేదు. వెంటనే స్థానికులు అందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తినే ఆహారంలో మత్తు మందు కలిపారని వైద్యులు తెలిపారు. కొత్త కోడలు తినే ఆహారంలో విషం కలిపి, ఇంట్లో ఉన్న నగలతో చెక్కేసిందని తెలిసిపోయింది. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలి కోసం వేట మొదలుపెట్టారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.