పైన ఫొటోలో ఏం తెలియనట్టుగా అమాయకపు చూపులతో కనిపిస్తున్న యువకుడి పేరు చోటూ కుమార్. బీహార్ లోని బర్హత్ సమీపంలోని జవతారి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అయితే ఇతగాడు ఉపాధి నిమిత్తం కొన్ని రాష్ట్రాల్లో ఉండి కొన్నాళ్లకి మళ్లీ తన సొంతూరుకి వస్తుండేవాడు. అలా కొన్నేళ్లలో చోటూ కుమార్ నాలుగు రాష్ట్రాలు చుట్టేశాడు. అలా వెళ్తూ వస్తున్న క్రమంలోనే చోటు కుమార్ కు మొదటగా ఓ రాష్ట్రానికి చెందిన యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయంతోనే ఓ మహిళను నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. అలా ఆమెతో కాపురం చేసి నలుగురు పిల్లలను కన్నాడు.
ఇక కొన్ని రోజుల తర్వాత చోటూ కుమార్ మరో రాష్ట్రానికి వెళ్లాడు. ఇక అక్కడికి వెళ్లాక.. మొదటి భార్యకు తెలియకుండా మంజు అనే యువతిని నమ్మించి రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకి రెండో భార్యకు ఇద్దరు పిల్లలు జన్మించారు. అలా మరో రాష్ట్రానికి వెళ్లి రెండు పెళ్లిళ్ల విషయాన్ని దాచి మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరిని నమ్మిస్తూ చోటూ కుమార్ ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో ఏకంగా ఆరుగురు మహిళలను నమ్మించి వివాహం చేసుకుని నిత్యపెళ్లికొడుకుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇదిలా ఉంటే చోటూ కుమార్ ఇటీవల జమాయి రైల్వే స్టేషన్ లో మరో మహిళతో ఉండగా.. రెండో భార్య అయిన మంజు సోదరుడు చూశాడు.
మరో మహిళతో ఉండగా బావను చూసి ఆ యువకుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఏంటన ప్రశ్నించి బావను నిలదీశాడు. ఇక ఇంతటితో ఆగని ఆ యువకుడు.. బావ తీరుపై కోపంతో ఊగిపోయి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిత్యపెళ్లికొడుకు చోటూ కుమార్ ను విచారించగా.. ఇతనికి నాలుగు రాష్ట్రాల్లో ఆరుగురి మహిళలను వివాహం చేసుకున్నాడని, పెళ్లి చేసుకుని పిల్లల్ని కని అనంతరం దొరకకకుండా తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.