భార్య భర్తల మధ్య ఎన్నో గొడవలు వస్తు ఉంటాయి పోతూ ఉంటాయి. వీటన్నిటిని అర్ధం చేసుకుని ముందుకు వెళితే వారి కాపురాలు కొన్ని కాలాల పాటు సంతోషంగా సాగిపోతాయి. కానీ చిన్న చిన్న మనస్పర్ధలకు అర్థం చేసుకోలేని భార్యాభర్తలు ఆత్మహత్యలు చేసుకోవడం లేదంటే హత్యలు చేయడం వంటివి చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భర్త భార్య కాపురానికి రావడం లేదని ఏకంగా అత్తింటి వాళ్లను తుపాకీతో కాల్చి చంపాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది బీహార్‌లోని నలంద జిల్లాలోని హిల్సా ప్రాంతం. ఇదే పట్టణానికి చెందిన సోను కుమార్ కుమార్ కి ముంగేర్ జిల్లా కాసిం పరిధిలోని ఘోసి తోలాకు చెందిన అంచల్ కుమారి అనే మహిళతో గత ఏడాది జులై 16న వివాహం జరిగింది. సోనుకుమార్ బీహార్ పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే కొంత కాలం బాగానే ఉన్న వీరి కాపురంలో కొన్ని రోజులకే మనస్పర్ధలు వచ్చి చేరాయి.
ఇది కూడా చదవండి: Newly Wed Woman: జీవితాంతం కలిసి ఉందాం అనుకున్నారు. కానీ..,పెళ్ళైన 19 రోజుల్లోనే భార్య!
దీంతో భార్యాభర్తల మధ్య రోజుకొక కారణంతో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వీరి గొడవల నేపథ్యంలో పోలీసు అధికారులు సైతం వీరికి కౌన్స్ లింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినా వీరి ప్రవర్తనలో ఎలాంటి మార్పులు మాత్రం సంభవించలేదు. దీంతో భర్తతో గొడవలను భరించలేని భార్య కొన్ని రోజుల కిందట పుట్టింటికి వెళ్లింది. ఇక ఎన్ని రోజులైన భార్య రాకపోవడంతో భర్తకు కోపం ఒక్కసారిగా పడగవిప్పింది. దీంతో ఎలాగైన అత్తింటికి వెళ్లాలనే ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగానే భర్త మంగళవారం నేరుగా వారి ఇంటికి వెళ్లిపోయాడు.
నా భార్యను నా ఇంటికి పంపిస్తారా లేదా అంటూ అత్తామామలతో గొడవకు దిగాడు. ఇక ఈ గొడవ చినిగి చినిగి గాలి వానలా తయారైంది. కోపంతో ఊగిపోయిన సోనుకుమార్ తుపాకీతో మామ గిర్‌ధర్ సావో, బావమరిది కృష్ణకుమార్‌పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మామ గిర్‌ధర్ సావో అక్కడికక్కడే మరణించగా, కృష్ణకుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచనలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.